ఏపీలో ఈనెల 11న ఓటర్ల తుది జాబితా

Update: 2019-01-02 03:52 GMT

18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులు ఓటు నమోదు చేసుకునేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఓటు నమోదు ప్రక్రియను వేగవంతం చేసింది. గ్రామస్థాయిలో ఓటు నమోదు చేసుకోవడానికి ప్రతిఒక్కరికి అవగాహనా కార్యక్రమాలు చేపడుతోంది. అలాగే ఈ నెల 11న తుది జాబితాను ప్రచురించనుంది. ఎలాంటి తప్పులు లేకుండా ఓటర్ల జాబితా పారదర్శకంగా ఉండాలని రిటర్నింగ్‌ అధికారులను ఆదేసింది.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నమోదైన ఓటర్ల తుది జాబితాను ప్రచురించనుంది. ఓటరు తమ పేర్లు ఉన్నదీ, లేనిదీ చూసుకోవడానికి ఎలక్షన్‌ కమిషన్‌ అధికారిక సైట్‌లోనూ, ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల వద్ద తుది జాబితాను అందుబాటులో ఉంచనుంది. అలాగే బూత్ లెవల్లో రాజకీయ పార్టీలకూ ఈ జాబితాను అందజేయనుంది. ఓటర్లు తుది జాబితాలో తమ పేర్లు లేకపోయినా, ఏవైనా తప్పులు దొర్లినా ఓటర్లు మళ్లీ నమోదు చేసుకోవచ్చునని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది. 

Similar News