మరో కీలక టికెట్ కన్ఫామ్ చేసిన జగన్

Update: 2019-01-18 01:14 GMT

వైసీపీ అధినేత వైయస్ జగన్ మరింత దూకుడు పెంచారు. ఎన్నికలకు కీలక సమయం మరో రెండు నెలలు మాత్రమే ఉన్నదున విదేశీ పర్యటనను సైతం రద్దు చేసుకుని పటిష్టమైన వ్యూహాలు రచిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే 60 శాతం ఎమ్మెల్యే సీట్లు కన్ఫర్మ్ చేసిన జగన్ తాజాగా మరో కీలక నియోజకవర్గానికి అభ్యర్థిని ఫైనల్ చేశారు. రాష్ట్రంలోనే అత్యంత కాస్ట్లీ ఎస్ట్ నియోజకవర్గంగా పేరొందిన దర్శికి ప్రముఖ పారిశ్రామిక వేత్త మద్దిశెట్టి వేణుగోపాల్ ను ఎనౌన్స్ చేశారు. మద్దిశెట్టి గతంలో ప్రజారాజ్యం తరుపున పోటీ చేశారు. ఇక్కడ కాపు సామాజికవర్గం అధికంగా ఉంది. 2014 ఎన్నికల్లో వైసీపీ తరుపున బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, టీడీపీ తరుపున శిద్దా రాఘవరావు పోటీ పడ్డారు.

అయితే 7వందల ఓట్ల మెజారిటీతో శిద్దా గెలుపొందారు. ఆ ఎన్నికల్లో ఈ ఇద్దరు కలిసి 100 కోట్లకు పైగానే ఖర్చు చేసినట్టు అప్పట్లోప్రచారం జరిగింది. ఓటమి కారణంగా ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న శివప్రసాద్ రెడ్డి ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో బాదం మాధవరెడ్డిని తెరమీదకు తెచ్చిన వైసీపీ అధిష్టానం.. మంత్రి శిద్దా రాఘవరావు ముందు ఆయన నిలవరనే అభిప్రాయానికి వచ్చింది. దాంతో ప్రత్యామ్న్యాయం అలోచించి అన్నివిధాలా బలవంతుడైన మద్దిశెట్టిని పార్టీలో చేర్చుకుని టికెట్ కన్ఫర్మ్ చేసింది. మరి మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి, టికెట్ దక్కని మాధవరెడ్డిలు ఎంతమేర మద్దిశెట్టికి సహకరిస్తారన్నది ఇప్పుడు అందరిలోను నానుతున్న ప్రశ్న. 

Similar News