Coronavirus: విశాఖలో మరో కరోనా పాజిటివ్!

Update: 2020-03-23 01:23 GMT
another caronavirus case in ap (representational image)

ఆంధ్రప్రదేశ్ లో తొలి స్థానిక కరోనా కేసు నమోదు అయింది. ఇప్పటివరకూ మొత్తం 6 కేసులు నమౌ కాగా, వారంతా విదేశాల నుంచి వచినవారే. అయతే, తాజాగా నమోదైన కేసు మాతరం సౌదీ అరేబియా నుంచి విశాఖపట్నం వచ్చిన రోగికి దగ్గర బంధువు అయిన 49 ఏళ్ల మహిళకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు ఆంద్ర ప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది.

ఈ సందర్భంగా విదేశాల నుంచి వచ్చేవారితో జాగ్రత్తగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ ప్రజలను సూచించింది. ఇప్పటివరకు విదేశాల నుంచి ఏపీకి 13,301 మంది వచ్చారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. వీరిలో 11,206 మంది ఇళ్లలోనే స్వీయ నిర్బంధంలో ఉన్నారని పేర్కొంది. 2,222 మందికి ఇంట్లోనే 28 రోజుల ఐసోలేషన్‌ పూర్తయిందని ప్రభుత్వం తెలిపింది. 53 మందిని ఆస్పత్రుల్లో చేర్పించి వైద్యుల పర్యవేక్షణలో ఉంచినట్లు వెల్లడించింది.

మరో 16 మంది నమూనాలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉందని వివరించింది. కాగా, నెల్లూరులో కరోనా సోకిన వ్యక్తి పూర్తిగా కోలుకున్నాడని, అతడిని త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Tags:    

Similar News