ఈ నెల 11న ఏపీ మంత్రివర్గ సమావేశం

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశాల తేదీ ఖారారు అయ్యింది. ఈనెల 11 వతేదీ ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు.

Update: 2020-06-03 14:56 GMT

ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశాల తేదీ ఖారారు అయ్యింది. ఈనెల 11 వతేదీ ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఏపీ సీఎస్ నీలం సహానీ బుధవారం విడుదల చేశారు. అన్ని విభాగాల అధికారులు తమ తమ విభాగాలకు సంబంధించిన రిపోర్టులను సిద్ధం చేసుకోవాలని ఆ ఉత్తర్వుల్లో సీఎస్ ఆదేశించారు. ఇక మంత్రివర్గ సమావేశంలో కరోనావైరస్ విషయంలోనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది.

లాక్ డౌన్ సందర్భంగా ఏర్పడ్డ పరిస్థితులు, రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పోతిరెడ్డిపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ విషయంలో తలెత్తిన వివాదాల పై దృష్టి సారించవచ్చు. ఇక ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ వ్యవహారంలో కోర్టు తీర్పు నేపధ్యంలో ఈ అంశం పై చర్చ జరగొచ్చు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ పై కూడా ఈ క్యాబినెట్ మీటింగ్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. వాస్తవానికి ప్రభుత్వం ప్రతి నెల రెండుసార్లు మంతివర్గ సమావేశం నిర్వహిస్తుంది. ప్రతి నేలా రెండు, నాలుగు బుధవారాల్లో ఈ సమావేశాలు జరుగుతాయి. అయితే, కరోనావైరస్ కారణంగా ఈ మధ్యకాలంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కాలేకపోయింది.  


Tags:    

Similar News