గ్రేటర్ ఫైట్‎లో డబుల్ బెడ్‎రూమ్ ఇళ్ల పంపిణీ కలిసొచ్చేదెవరికి..?

గ్రేటర్ ఫైట్‎లో డబుల్ బెడ్‎రూమ్ ఇళ్ల పంపిణీ కలిసొచ్చేదెవరికి..?
x
Highlights

గ్రేటర్ ఫైట్ కు ముందు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ అధికార పార్టీకి కలిసొస్తుందా..? అదే పేదల పథకంపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎందుకు ఆశలు...

గ్రేటర్ ఫైట్ కు ముందు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీ అధికార పార్టీకి కలిసొస్తుందా..? అదే పేదల పథకంపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎందుకు ఆశలు పెట్టుకుంది..? అసలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అంశంలో కాషాయ పార్టీ వెతుకుతున్న లాజిక్ ఏంటి..? డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం ఎదురుచూసే వాళ్లంతా తమ వైపు వచ్చే వాళ్లే అనే కమలం ధీమాకు కారణాలేంటి..?

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అత్యధికంగా ప్రజలు ఆశలు పెట్టుకున్న పథకం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం. ఇదే పథకం ప్రధాన ఎజెండాగా టీఆర్ఎస్ ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందింది. గత గ్రేటర్ ఎన్నికల్లో సైతం ఇదే అంశాన్ని ప్రధాన ఎజెండా చేసుకుని అధికార పార్టీ విజయం సాధించింది. ఇలాంటి తరుణంలో మరోసారి గ్రేటర్ ఎన్నికల్లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఆ పార్టీకి కలిసొస్తుందా అంటే గతంలో హామీగా మాత్రమే ఉన్న పథకం ఇప్పుడు అమలుకు నోచుకోవడం ఓ విధంగా టీఆర్ఎస్ కు వరంగానే చెప్పాలి.

మరోవైపు గ్రేటర్ ఎన్నికల ముందు బీజేపీ కూడా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం తమకు కలిసొచ్చే అంశంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇళ్ల ప్రారంభోత్సవానికి వెళ్లని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల అంశం తమకు కలిసి వస్తుందని భారి ఆశలు పెట్టుకున్నారట. టీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చి వాటి స్థానంలో కొత్త ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి నాలుగేళ్ల సమయం తీసుకుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ల విలువ 8 లక్షలుగా చెబుతోంది. అయితే నాలుగేళ్లలో పేద ప్రజలు దాదాపు నాలుగు లక్షల రూపాయలు అద్దెలు కట్టారు కాబట్టి ప్రభుత్వం ఇస్తున్న ఇళ్లు వారికి నాలుగు లక్షల విలువగానే భావిస్తారని కాషాయ పార్టీ అంచానవేస్తుంది. దీనికి తోడు ప్రభుత్వం ఖాళీ చేయించిన వారందరికి కాకుండా కొందరికే ఇళ్లిచ్చింది. దీంతో ఇళ్లు రానివారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు కాబట్టి వాళ్లంతా తమకు ఓటు బ్యాంకుగా మారతారని కాషాయ పార్టీ లెక్కలు కడుతున్నట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం ప్రభుత్వం నుంచి ఇళ్లను అందుకున్న లబ్ధిదారులకంటే ఆశావహులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి గ్రేటర్ ఫైట్ లో ప్రభుత్వాని వ్యతిరేకంగా ఉన్న వాళ్లంతా తమకు ఓట్ల వర్షం కురిపిస్తారని బీజేపీ అంచనాలు వేస్తోంది. ఈ క్రమంలో డబుల్ బెడ్ రూమ్ పథకంపై ఆశలు పెట్టుకున్న రెండు పార్టీలకు ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నారనేది వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories