తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి కోలాహలం

Vinayaka Navratri Festivals Till September 9th
x

తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి కోలాహలం

Highlights

*సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ వరకు వినాయక నవరాత్రోత్సవాలు

Hyderabad: తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి కోలాహలం మొదలయ్యింది. గణనాధులు మండపాలకు తరలించారు. కరోనాతో గత రెండేళ్లుగా అంతంత మత్రమంగా జరుపుకున్న వినాయక చవితి వేడుకలను ఈ ఏడాది రెట్టింపు ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. పర్యావరణ రహితం కోసం ప్లాస్టర్ ఆఫ్ పారీస్ కు బదులు మట్టి విగ్రహాలు ప్రతిష్టించేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపారు. ప్రభుత్వం, స్వచ్ఛంధ సంస్థల ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. వాహానాల్లో సందడిగా విగ్రహాలను మండపాలకు తరలించారు. వాడవాడలా విగ్రహాలు పెట్టేందుకు పోటీ పడుతున్నారు

వినాయక చవితి పురస్కరించుకొని మార్కెట్లు నూతన కళను సంతరించుకున్నాయి. వినాయక చవితి పూజా సామాగ్రి కొనుగోళ్ళతో మార్కెట్లు కళకళలాడుతున్నాయి. వినాయకుని విగ్రహాలు, పూలు, పళ్లు, అలంకరణ, సామాగ్రి కోసం జనం ఎగబడుతుండటం కనిపించింది. ఏడాది కోసారి జరిగే గణనాథుడి ఉత్సవాలను యువత ఘనంగా జరుపుకునేందుకు సిద్ధం అయ్యారు. వినాయకచవితికి ఉత్సహంగా ఏర్పాట్లు చేపట్టారు. ఈసారి అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో ఘనంగా నిర్వహించేందుకు పోటీపడుతుండటంతో.. మార్కెట్లో వినాయక విగ్రహాలకు మంచి డిమాండ్ ఏర్పడింది. ప్రతి వీధిలో వినాయక మండపాలు ఏర్పాటు చేశారు. విభిన్న ఆకృతుల్లో ఉన్న వినాయక ప్రతిమలు కనువిందు చేస్తున్నాయి. ప్రధాన రహదారులతో పాటు.. చిన్న చిన్న వీధుల్లోనూ ఎటు చూసిన వినాయక మండపాలు ఏర్పాటు చేశారు.

హైదరాబాద్ సిటీ అంతటా వినాయకచవితి సందడి నెలకొన్నది. ఇవాళ్టి నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు నిర్వహించే నవరాత్రి ఉత్సవాలకు నగర ప్రజలు సిద్దం అయ్యారు. నగర వ్యాప్తంగా వేల సంఖ్యలో వినాయక మండపాలు ఏర్పాటు చేశారు. పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలు నెలకొల్పుతున్నారు. మరో వైపు అందమైన రంగులతో ముస్తాబు చేసిన ప్లాస్టర్ ఆఫ పారిస్ విగ్రహాలకు సైతం భారీగానే డిమాండ్ ఉంది. ప్రధానంగా వినాయక విగ్రహాలు తయారు చేసే దూల్ పేట, ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్, మియాపూర్, కూకట్ పల్లి ప్రాంతాల్లో మూడు నాలుగు రోజులుగా సందడి పెరిగింది.

హైదరాబాద్ మహానగరంలో ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ లో ఈ ఏడాది మహాగణపతి మట్టిప్రతిమను ఏర్పాటు చేశారు. పంచముఖ మహాలక్ష్మీగణపతిగా కొలువుదీరాడు. 50 అడుగుల ఎత్తులో ఉన్న ఈ వినాయకుడికి ఎడమ వైపున శ్రీషణ్ముఖ సుబ్రమణ్యస్వామి, కుడివైపున శ్రీత్రిశక్తి మహాగాయత్రి దేవి కొలువుదీరారు. మహా వినాయకుడిని దర్శించుకునేందుకు తరలివచ్చే భక్తులతో తొక్కిసలాట జరగకుండా ఉండేలా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తుల కోసం బారీకేడ్లు ఏర్పాటు చేశారు. మండపాలకు రంగురంగలు విద్యుత్ లైట్లు విరజిమ్మేలా ఏర్పాటు చేశారు.

గణేష్ నవరాత్రి ఉత్సవాలకు హైదరాబాద్ సిటీ సహా ఇతర ప్రాంతాలు ముస్తాబయ్యాయి. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా గణేష్ ఉత్సవాలను రెండేళ్లుగా పెద్దగా జరుపుకోలేదు. ఈసారి మాత్రం గణేష్ నవరాత్రి ఉత్సవాలను..గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అసలు గణేష్ నవరాత్రి ఉత్సవాలంటేనే వెంటనే గుర్తొచ్చేది ఖైరతాబాద్ వినాయకుడు. ఈసారి ఖైరతాబాద్ లో మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. 50 అడుగుల భారీ విగ్రహాన్ని చూసేందుకు లక్షలాదిగా భక్తులు తరలిరానున్నారు.

గత రెండేళ్లుగా గణేష్ ఉత్సవాలు అంతగా జరగకపోవడంతో ఈసారి రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. రెండేళ్లతో పోలిస్తే ఈసారి డబుల్ రేట్లు ఉన్నాయంటూ నగరవాసులు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విగ్రహాల రేట్లను తగ్గిస్తే బాగుంటుందని చెప్తున్నారు. వినాయక చవితి రోజు మండపాల్లోనే కాదు ఇంట్లో కూడా ప్రత్యేక పూజలు చేస్తారు భక్తులు. అందుకోసం రకరకాల పూజా సామగ్రిని ఉపయోగిస్తారు. పూజా సామాగ్రి కొనుగోలుతో హైదరాబాద్ లోని ప్రధాన మార్కెట్లు సందడిగా మారాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories