తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ వేగవంతం.. హర్షం వ్యక్తం చేస్తున్న...

TSPSC Speed up the Process of Recruitment of Medical Staff | Live News
x

తెలంగాణ వైద్యఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీ వేగవంతం.. హర్షం వ్యక్తం చేస్తున్న...

Highlights

TSPSC: నియామక ప్రక్రియకు శ్రీకారం చుట్టిన టీఎస్‌పీఎస్‌సీ...

TSPSC: తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో నియామక ప్రక్రియను వేగవంతం చేశారు. తొలివిడతలో వైద్య ఆరోగ్య శాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ మొదలకు కొని నర్సులు, పారా మెడికల్ సిబ్బంది పోస్టులు భర్తీ చేయనున్నారు. ప్రభుత్వం నిర్ణయం పట్ల నిరుద్యోగ వైద్య విద్యార్దుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. మూడు కేటగిరిల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటీఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం వైద్యశాఖలో టెంపరరీగా పని చేస్తున్న వారిని పర్మినెంట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం పట్ల ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తం అవుతోంది.

ఇంత కాలం ఆసుపత్రుల్లో వైద్య సిబ్బంది కొరతతో పని భారంతో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని.. వైద్యశాఖలో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రిక్రూట్ మెంట్ కు ప్రభుత్వం చర్యలు చేపట్టడం శుభపరిణామం అంటున్నారు వైద్యులు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం సులభతరం అవుతుందని చెబుతున్నారు. ప్రభుత్వాసుపత్రులో వీలైనంత తర్వగా ఇతర పోస్టులు భర్తీ ప్రక్రియ కూడా చేపట్టాలని వైద్య సిబ్బంది కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories