జోరుగా నిషేధిత బిటి-3 పత్తివిత్తనాలు సరఫరా

Rachakonda Police Seized 15 Quintals of Spurious Cotton Seeds
x

జోరుగా నిషేధిత బిటి-3 పత్తివిత్తనాలు సరఫరా

Highlights

Spurious Cotton Seeds: తాజాగా 15క్వింటాళ్ళ బిటి-3 విత్తనాలు స్వాధీనం

Spurious Cotton Seeds: దేశంలో నిషేధిత బిటి-3 పత్తివిత్తనాలు సరఫరా చేస్తున్న ఇద్దరు అంతరాష్ట్ర నిందితులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 15క్వింటాళ్ళ బిటి-3 విత్తనాలు, ఒక కారు, రెండు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక నుంచి విజయవాడకు హైదరాబాద్ మీదుగా తరలిస్తున్న నిందితులు మన్నెం లక్ష్మీనారాయణ, శ్రీనివాసరావును నగర శివారులో పట్టుకున్నారు. ఈ ఇద్దరు నిందితులు గతంలో నిషేధిత బిటి-3 పత్తివిత్తనాలను తెలంగాణాలో పలువురి రైతులకు అమ్మినట్లు రాచకొండ కమిషనర్ మహేష్ భగత్ తెలిపారు

నకిలీ విత్తనాలు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతారని.. పోలీసులు, అగ్రీకల్చర్ టీమ్స్ సంయుక్తంగా ఇలాంటి ముఠాల భరతం పట్టాలని వ్యవసాయ అధికారిణి సుజాత అన్నారు. బిటి 3 విత్తనాలు మన దేశంలో నిషేధమని కమిషనర్ మహేష్ భగత్ వెల్లడించారు. రైతులు ఎక్కడ కూడా రోడ్డుపైన విత్తనాలు కొనవద్దని పోలీసులు, అగ్రికల్చర్ అధికారులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories