నేటితో ముగియనున్న ఆస్తుల నమోదు ప్రక్రియ

నేటితో ముగియనున్న ఆస్తుల నమోదు ప్రక్రియ
x
Highlights

తెలంగాణ రాష్ట్రంలో ఆస్తుల నమోదు ప్రక్రియ శరవేగంగా కొనసాగింది. ఈ ప్రక్రియలో రాష్ట్రంలో ఉన్న ఇళ్లు మాత్రమే ఆస్తుల వివరాలను కూడా సేకరిస్తోంది. అయితే ఈ...

తెలంగాణ రాష్ట్రంలో ఆస్తుల నమోదు ప్రక్రియ శరవేగంగా కొనసాగింది. ఈ ప్రక్రియలో రాష్ట్రంలో ఉన్న ఇళ్లు మాత్రమే ఆస్తుల వివరాలను కూడా సేకరిస్తోంది. అయితే ఈ ధరణి పోర్టల్ లో ఆస్తుల నమోదు ప్రక్రియకు ప్రభుత్వం ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా చేసిన సర్వేలో 80 శాతానికిపైగా ఆస్తుల నమోదు ప్రక్రియ పూర్తైందని అధికారులు వెల్లడించారు. ఒక్క జీహెచ్ఎంసీలోనే ఐదు లక్షలా 60 వేలు మంది వ్యవసాయేతర స్థిరాస్తుల వివరాలను నమోద చేసుకున్నారని స్పష్టం చేసారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 79 లక్షలకు పైగా ఆస్తుల వివరాలను నమోదు చేయగా వాటితో కేవలం జీహెచ్ఎంసీలోనే ఐదు లక్షలా 60 వేలు ఆస్తుల వివరాలు నమోదయ్యాయన్నారు.

రాష్ట్రంలోని ఇతర పట్టణాల్లో 16 లక్షలా 11వేల ఆస్తుల వివరాలు నమోదయ్యాయని అధికారులు స్పష్టం చేసారు. ఇక గ్రామపంచాయతీల్లో 57 లక్షలా 33 వేల ఆస్తుల వివరాలు నమోదయ్యాయని తెలిపారు. వర్షాల నేపథ్యంలో గత మూడు, నాలుగు రోజులుగా హైదరాబాద్​లో ఆస్తుల నమోదు ప్రక్రియ జరగడం లేదని, వెబ్ పోర్టల్, మీసేవ ద్వారా కొంతమంది స్వయంగా ఆస్తుల వివరాలను నమోదు చేస్తున్నారని అధికారులు తెలిపారు.

అయితే కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చిన తెలంగాణ ప్రభుత్వం ఈ దసరా నాడు ఈ పోర్టళ్లను ప్రారంభించాలని ముహూర్తం కూడా ఖరారు చేసింది. ధరని పోర్టల్ ప్రారంభించిన తరువాత వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల లావాదేవీలకు వేర్వేరుగా ధరణి పోర్టళ్లను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సాగు భూముల రిజిస్ట్రేషన్లను తహసీళ్లలో, వ్యవసాయేతర ఆస్తులను సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అనుసందానం చేయనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories