శామీర్‌పేట్‌ బాలుడు అదియాన్‌ కేసులో కొత్త ట్విస్ట్‌

శామీర్‌పేట్‌ బాలుడు అదియాన్‌ కేసులో కొత్త ట్విస్ట్‌
x
Highlights

హైదరాబాద్‌ శామీర్‌పేట్‌లో అదృశ్యమైన బాలుడు సయ్యద్ అదియాన్ కేసు కొలిక్కి వచ్చింది. శామీర్‌పేట్‌ దగ్గర ఔటర్ రింగ్ రోడ్‌ పక్కన అదియాన్ మృతదేహాన్ని...

హైదరాబాద్‌ శామీర్‌పేట్‌లో అదృశ్యమైన బాలుడు సయ్యద్ అదియాన్ కేసు కొలిక్కి వచ్చింది. శామీర్‌పేట్‌ దగ్గర ఔటర్ రింగ్ రోడ్‌ పక్కన అదియాన్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అదియాన్ కనిపించడం లేదని ఈనెల 15న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి కోసం గాలిస్తూ శామీర్‌పేట్‌ దగ్గర ఓఆర్‌ఆర్‌ పక్కన ఫారెస్ట్ ఏరియాలో సయ్యద్ అదియాన్ మృతదేహాన్ని గుర్తించారు.

శామీర్‌పేట్‌ బాలుడు సయ్యద్‌ అదియాన్‌ది హత్యగా పోలీసులు తేల్చారు. అదియాన్ ఇంట్లో కిరాయికి ఉండే బీహార్ వాసి సుధాంశు శర్మను నిందితుడిగా గుర్తించారు. షేర్ చాట్ స్కిట్ కోసం అదియాన్‌ను ఓఆర్‌ఆర్‌పైకి తీసుకెళ్లిన నిందితుడు సుధాంశు శర్మ బాలుడితో జంపింగ్ చేయించాడు. అయితే, జంపింగ్ స్కిట్ చేస్తుండగా సయ్యద్‌ అదియాన్‌ తలకు తీవ్ర గాయమైంది. దాంతో, భయపడ్డ నిందితుడు అదియాన్ కుటుంబ సభ్యులకు తెలిస్తే ఏమంటారోనని గొంతు నులిమి చంపేశాడు. అనంతరం, మృతదేహాన్ని ఒక బ్యాగులో పెట్టి శామీర్‌పేట్‌ ఫారెస్ట్ ఏరియాలో పడేశాడు. ఆ తర్వాత అదియాన్ పేరెంట్స్‌కు ఫోన్ చేసి నీ కొడుకును కిడ్నాప్ చేశాను 15లక్షల రూపాయలు ఇస్తే వదిలిపెడతానంటూ బెదిరింపులకు దిగాడు. కిడ్నాప్ ఫోన్ కాల్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని పట్టుకుని అనంతరం, అదియాన్ మృతదేహాన్ని గుర్తించారు.

అయితే, అదియాన్‌ను ఎప్పుడో చంపేసినా మహబూబాబాద్‌ దీక్షిత్ మర్డర్ ఇన్సిడెంట్‌ను టీవీల్లో చూసిన నిందితుడు సుధాంశు శర్మ కిడ్నాప్ డ్రామాకు తెరలేపాడు. నీ కొడుకును కిడ్నాప్ చేశామ్ 15లక్షలు ఇస్తే విడిచిపెడతానంటూ అదియాన్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు. ఈ కిడ్నాప్ డ్రామానే నిందితుడు సుధాంశు శర్మ దొరకడానికి కారణమైంది. నిందితుడు ఫోన్ కాల్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు సుధాంశు శర్మను అరెస్ట్ చేసి అదియాన్ మృతదేహాన్ని గుర్తించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories