KTR: మేం మతం ముసుగులో రాజకీయాలు చేయం

Minister KTR Answered a Question Asked by Netizens on the Twitter
x

KTR: నెటిజన్‌కు దిమ్మతిరిగే సమధానం ఇచ్చిన మంత్రి కేటీఆర్

Highlights

KTR: నెటిజన్‌కు దిమ్మతిరిగే సమధానం ఇచ్చిన మంత్రి కేటీఆర్

KTR: తెలంగాణ సెక్రటేరియట్‌ కూల్చివేతలో భాగంగా గతంలో అక్కడ ఉన్న మసీదులు, ఆలయం, చర్చిలను తొలగించారు అధికారులు. అయితే వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేపడతామని ప్రభుత్వం గతంలోనే ప్రకటిచింది. అయితే ఇప్పటివరకు ఆ హామీకి తగ్గట్టు చర్యలు లేకపోవడంతో ఓ నెటిజన్‌ ట్విట్టర్‌లో మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నించాడు. సచివాలయంలో మందిర్‌ నిర్మాణం ఏమైందంటూ ట్వీట్‌ చేశాడు. ఈ ప్రశ్నకు మంత్రి కేటీఆర్‌ గట్టిగానే బధులిచ్చారు. తాము మతం ముసుగులో రాజకీయాలు చేయమని, కేసీఆర్‌ నాయకత్వంలో అన్ని మతాలను సమానంగా చూస్తున్న రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఇక తెలంగాణ సెక్రటేరియట్‌లో మందిరం నిర్మిస్తాం.. మజీద్ నిర్మిస్తాం.. చర్చిని కూడా నిర్మిస్తాం.. మీరు నిశ్చింతగా ఉండండి. అంటూ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు ట్విట్టర్ వేదికగా మంత్రి కేటీఆర్ జవాబిచ్చారు.

కొత్త సెక్రటేరియట్‌(New Secretariat) నిర్మాణంలో భాగంగా గతంలో పాత సెక్రటేరియట్‌లో ఉన్న మసీదులు, నల్లపోచమ్మ దేవాలయం, చర్చిలను తొలగించారు. అయితే వాటి స్థానంలో కొత్త నిర్మాణాలు చేపడతామని స్పష్టం చేసిన ప్రభుత్వం ఒక్కో ప్రార్థనా మందిరానికి 15 వందల చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. మరోవైపు సచివాలయ నిర్మాణ పనులు వడివడిగా సాగుతున్నాయి. వచ్చే దసరా నాటికి కొత్త సచివాలయ భవనాన్ని పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని ఇంజినీర్లు, కాంట్రాక్టర్లకు ఇప్పటికే సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. దీంతో అందుకు అనుగుణంగా పనులు వేగవంతం చేశారు అధికారులు. మొత్తం 12 వందల 50 మంది కార్మికులు సచివాలయ నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు. 3 షిఫ్టులుగా 24 గంటలు పనులు కొనసాగిస్తున్నారు. మరోవైపు ఇతర పనులను కూడా సమాంతరంగా చేపడుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories