ప్రముఖ ప్రవచన కర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి కన్నుమూత

Malladi Chandrasekhara Sastry Passed Away
x

ప్రముఖ ప్రవచన కర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి కన్నుమూత

Highlights

Malladi Chandrasekhara Sastry: ప్రముఖ ప్రవచన కర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి కన్నుమూశారు.

Malladi Chandrasekhara Sastry: ప్రముఖ ప్రవచన కర్త మల్లాది చంద్రశేఖర శాస్త్రి కన్నుమూశారు. ఆయన వయస్సు 96 ఏళ్లు. 1925 ఆగస్టు 28వ తేదీన మల్లాది దక్షిణామూర్తి దంపతులకు జన్మించారు. అమరావతి పరిసర గ్రామాల్లో వేద విద్యలకు మల్లాది వారి కుటుంబం పేరు పొందింది. బాల్యంలో చంద్రశేఖర శాస్త్రి వారి తాతగారు మల్లాది రామకృష్ణ విద్వత్ చయనుల దగ్గర సంస్కృతం, తెలుగు భాషా సాహిత్యాలు నేర్చుకున్నారు. తాతగారి దగ్గరనే శాస్త్ర ప్రకరణం, చెప్పుకుని వేదాధ్యానం చేశారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి. ఉపన్యాసం, హరికథ, నాటకం, పురాణం కలిపి శ్రోతలను ఆకట్టుకునే విధంగా పురాణ ప్రవచనం చేయడంలో మల్లాది చంద్రశేఖరశాస్త్రి సుప్రసిద్ధులు.

Show Full Article
Print Article
Next Story
More Stories