Hyderabad Metro Rail: మెట్రో ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్

Hyderabad Metro Rail Fares Set to go up
x

Hyderabad Metro Rail: మెట్రో ప్రయాణికులకు బ్యాడ్‌న్యూస్

Highlights

Hyderabad Metro Rail: హైదరాబాద్‌ నగరవాసులకు మెట్రోరైలు ప్రయాణం భారం కానుందా..?

Hyderabad Metro Rail: హైదరాబాద్‌ నగరవాసులకు మెట్రోరైలు ప్రయాణం భారం కానుందా..? సుఖవంతమైన ప్రయాణం ఇకపై బరువు కానుందా..? ఏప్రిల్‌ నుంచి కరెంట్‌ ఛార్జీల మోత మోగనుందనే వార్తలతో మెట్రోరైలు ఛార్జీలు కూడా పెరగనున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.

హైదరాబాద్‌ నగర ప్రజలు సౌకర్యవంతమైన ప్రయాణానికి ఉపయోగించే ప్రదాన సాదనంగా మెట్రోరైలును వాడుతున్నారు. గ్రేటర్ ప్రజల కలల మెట్రో రైలు నిర్వహణ భారంగా మారుతున్న నేపథ్యంలో చార్జీలు పెంచక తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి. ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా పెరగని ఆక్యుపెన్సీతో ఇబ్బందులు ఎలాగూ ఉన్నాయి. దానికి తోడు ఏప్రిల్ నుంచి విద్యుత్ ఛార్జీల భారం పెరుగుతాయనే వార్తలు వినిపిస్తున్న నేపద్యంలో మెట్రో రైలు సంస్థ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడిన చందంగా మారిందనే అబిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రస్తుతం ప్రతిరోజు సరాసరిన కోటి రూపాయల నష్టంతో మెట్రో రైలు నడుస్తుంది. రెండేళ్ల క్రితం మూడు మార్గాల్లో 4.5 లక్షల ప్రయాణికులతో కళకళలాడిన మెట్రో రైళ్లు.. ప్రస్తుతం అందులో సగానికి కూడా ప్రయాణికులు ఎక్కడం లేదు. ఈ నేపద్యంలో పెరిగే కరెంటు చార్జీలు మరింత భారం కాబోతున్నాయి. ఇప్పుడు ప్రతీ యూనిట్ కు డిమాండ్ చార్జీలతో కలిపి 5.28 వసూలు చేస్తున్నారు. అదే ఏప్రిల్ నుంచి ప్రతీ యూనిట్ కు 6.57 వసూలు చేసే అవకాశాలున్నాయి. దీంతో మెట్రో చార్జీలు పెంచే అవకాశాలు ఉన్నాయి. ఏప్రిల్‌ నెలలో కరెంట్ చార్జీల పిడుగు పడితే ఆ భారాన్ని మెట్రో సంస్థ ప్రయాణికుల మీద మోపే అవకాశం లేకపోలేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories