హైదరాబాద్‌లో గంట గంటకు మారుతున్న వాతావరణం

Hourly Changing Weather in Hyderabad
x

హైదరాబాద్‌లో గంట గంటకు మారుతున్న వాతావరణం

Highlights

Hyderabad Rain: నగరంలో ఓ గంట వర్షం... మరో గంట ఎండ

Hyderabad Rain: హైదరాబాద్‌లో గంట గంటకు వాతావరణం మారుతోంది. ఓ గంట వర్షం కొడుతుండగా మరో గంట ఎండ కాస్తోంది. వర్షాల నేపథ్యంలో నగరవాసులకు పోలీసులు కీలక సూచన చేశారు. వర్షాల నేపథ్యంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షం తగ్గిన తర్వాతే బయటకు వచ్చేలా ప్లాన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు.

ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య ఏర్పడిన ఉపరతలద్రోణి కారణంగా రాష్ట్రంలో అక్కడక్కడ భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్​లోను కొన్ని ప్రాంతాల్లో భారీగా వర్షం పడుతోంది. దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, ఎల్బీ నగర్, అంబర్‌పేట్ ప్రాంతాల్లో వర్షం పడుతోంది. విద్యానగర్, నల్లకుంట, ఉప్పల్, రామాంతాపూర్‌లో కూడా ఉదయం నుంచి వర్షం కురుస్తోంది.

రహదారులపై వర్షపు నీరు చేరి చెరువులను తలపిస్తున్నాయి. ఉదయాన్నే కార్యాలయాలకు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే వాహనదారులు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లన్నీ జలమయం కావడంతో ఎక్కడ ఏ నాళా ఉందో తెలియక భయపడుతున్నారు. వర్షంలోనే వాహనదారులు తడిసిముద్దవుతున్నారు. మరోవైపు నగరవాసులకు ట్రాఫిక్ పోలీసుల పలు సూచనలు చేశారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, వర్షం తగ్గిన తర్వాతే బయటకు వచ్చేలా ప్లాన్‌ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories