Weather Report: తెలుగురాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు

Heavy Rains in Telugu States
x

Weather Report: తెలుగురాష్ట్రాల్లో దంచికొడుతున్న వానలు

Highlights

Weather Report: ఏపీ, తెలంగాణలో పలుచోట్ల భారీ వర్షాలు

Weather Report: తెలుగురాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. వేసవి తాపం నుంచి ఉపశమనం కల్పిస్తున్నా.. అకాల వర్షాలతో రైతులు ఇబ్బందుల పాలవుతున్నారు. ఏపీ, తెలంగాణలో పలుచోట్ల రెండు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. సిద్దిపేట జిల్లాలో సాయంత్రం వేళ ఒక్కసారిగా గాలి దుమారం, ఉరుములు మెరుపులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు బీభత్సంతో చెట్లు విరిగి రోడ్డుపై పడ్డాయి. దీంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. విద్యుత్ వైర్లు తెగి కిందపడటంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. ఇక అకాల వర్షంతో మామిడి తోటలు దెబ్బతినడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అటు ఏపీలోని విశాఖ జిల్లాలో పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. విశాఖ నగరంలో ఈదురుగాలులు వీచాయి. తగరపువలస, ఆనందపురం, మధురవాడ ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురవడంతో వర్షపు నీరు రోడ్లపైకి వచ్చి చేరింది. ఇక విజయనగరం జిల్లాలోని పురుపల్లి, గజపతినగరం నియోజకవర్గాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు,మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. గాలుల ప్రభావంతో చెట్లు,విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. గుర్ల మండలం తెట్టంగిలో వర్షంతోపాటు పిడుగులు పడ్డాయి. దీంతో ఓ గేదెల కాపరి పిడుగుపాటుకు గురయ్యాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories