పెళ్లి మండపంలో నిప్పంటించుకున్న ప్రియుడు.. మంటలతోనే వధువును హత్తుకున్నాడు..

Groom Sets Himself on Fire and Hugs Bride
x

పెళ్లి మండపంలో నిప్పంటించుకున్న ప్రియుడు.. మంటలతోనే వధువును హత్తుకున్నాడు..

Highlights

Hyderabad: హైదరాబాద్‌లో ప్రియుడి పైశాచికం ప్రాణాలమీదికి తెచ్చుకున్న ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది.

Hyderabad: హైదరాబాద్‌లో ప్రియుడి పైశాచికం ప్రాణాలమీదికి తెచ్చుకున్న ఉదంతం ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రేమించిన ప్రియురాలు దక్కలేదని మనస్తాపానికి గురై నిప్పంటించుకున్నాడు. అంతేకాదు తనకు దక్కని ప్రియురాలు మరొకరికి దక్కకూడదని పెళ్లిపీటలు ఎక్కేందుకు సిద్ధమైన వధువును హత్తుకున్నాడు. హైదరాబాద్‌ లంగర్‌ హౌస్‌ సమీపంలో ఓ కళ్యాణ మండపంలో జరిగిన ఈ ఘటనతో పెళ్లికొచ్చిన బంధుమిత్రులు ఖంగుతిన్నారు. పెళ్లిమండపంలోకి దూసుకొచ్చిన ఘటనతో బెంబేలెత్తిపోయారు. ఈ ఘటనలో ప్రియురాలైన వధువు స్వల్పంగా గాయపడింది. గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రికి తరలించారు. కాలిన గాయాలతో చికిత్స పొందుతూ ప్రియుడు తనువు చాలించాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories