Cyberabad: చైల్డ్‌ కేర్ సెంటర్‌లను ఏర్పాటు చేసిన సైబరాబాద్ పోలీసులు

Cyberabad Police Arranged the Child Care Centers
x

సైబరాబాద్ సీపీ సజ్జనార్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Cyberabad: పేరెంట్స్‌ కొవిడ్ బారినపడితే వారి పిల్లలకు ఆశ్రయం * చైల్డ్‌ కేర్‌ సెంటర్‌లుగా మారిన డే కేర్ సెంటర్‌లు

Cyberabad: కొవిడ్ బారినపడిన తల్లిదండ్రుల కారణంగా నిరాశ్రయులుగా ఉన్న పిల్లలకు సైబరాబాద్‌ పోలీసులు తోడ్పాటు అందిస్తున్నారు. తల్లిదండ్రులు కరోనా బారినపడితే వారి పిల్లలకు పోలీసులు ఆశ్రయం కల్పిస్తున్నారు. పసిపిల్లల సంరక్షణ కొరకు డేకేర్ సెంటర్‌లను చైల్డ్‌కేర్‌ సెంటర్‌గా మారుస్తున్నారు. పేరెంట్స్‌కు కరోనా నెగెటివ్‌ వచ్చే వరకు చైల్డ్‌కేర్‌లో పిల్లలను ఉంచవచ్చని పిలుపునిచ్చారు. చైల్డ్‌ కేర్‌లో ఉంటున్న పిల్లలపట్ల అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. తల్లిదండ్రులు కరోనా బారినపడితే వారి పిల్లల కోసం హెల్ప్‌లైన్ ఏర్పాటు చేశారు సైబరాబాద్ పోలీసులు. 040- 4581 1215కు కాల్‌ చేయాలని సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories