Telangana: మళ్లీ లక్ష్మారెడ్డికే వైద్య ఆరోగ్య శాఖ?

Again Health Department to Laxma Reddy
x

మంత్రి లక్ష్మ రెడ్డి 

Highlights

Telangana: వైద్య ఆరోగ్యశాఖను మాజీ మంత్రి సి లక్ష్మారెడ్డికే మళ్లీ ఆ పదవికి ఇవ్వనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

Telangana: తెలంగాణ లో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా మళ్లీ లక్ష్మారెడ్డికే దక్కనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖను తన వద్దే అట్టిపెట్టుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. త్వరలోనే మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరించనున్నారనే ప్రచారం జరుగుతోంది. తన టీమ్‌ ఈటల నుంచి తీసుకున్న వైద్య ఆరోగ్యశాఖను మాజీ మంత్రి సి లక్ష్మారెడ్డికే మళ్లీ ఆ పదవికి ఇవ్వనున్నట్లు వార్తలు గుప్పుమంటున్నాయి.

ఆరోగ్య మంత్రిత్వ శాఖ నుంచి ఈటల రాజేందర్‌ను తొలగించిన తరువాత.. ఆ పోర్ట్ పోలియోను ముఖ్యమంత్రి కేసీఆర్ తన వద్దే ఉంచుకున్నారు. అయితే, రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో పరిస్థితిని పర్యవేక్షించిందుకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రత్యేక కార్యదర్శికి బాధ్యతలు అప్పగించారు. కరోనా వ్యాప్తి విస్తృతంగా ఉన్న నేపథ్యంలో ప్రతీ రోజూ పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు.

అయితే, సీఎంఒ లోని ఓ సీనియర్ అధికారి ఆరోగ్యశాఖ అధికారులకు అందుబాటులో ఉండటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఫలితాలు ఆరోగ్య శాఖ అధికారులు సీఎంకు ఏదైనా ముఖ్యమైన సందేశాన్ని ఇవ్వడం కూడా కష్టసాధ్యమవుతోందంటున్నారు. సీఎం కేసీఆర్ తన కేబినెట్ లో మార్చులు, చేర్పులు త్వరలోనే జరుగుతాయనే గులాబీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఇప్పటికే కారు పార్టీ అధినేత ఇచ్చిన టాస్క్ పూర్తి చేసిన వారికి, పార్టీకి లాయల్‌గా ఉన్న వారికి పదవులు కట్టబెడుతారని గులాబీ వర్గాలంటున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories