ACB Rides: శంషాబాద్ ఎంపీవో ఇంటిపై ఏసీబీ రైడ్స్

ACB Rides on Shamshabad MPO Officer House
x

ACB Rides: శంషాబాద్ ఎంపీవో ఇంటిపై ఏసీబీ రైడ్స్

Highlights

ACB Rides: రూ.20 కోట్లు ఆస్తులు ఉన్నట్లు నిర్దారణ

ACB Rides: చేసే ఉద్యోగం గోరంత సంపాదనమాత్రం చారడంత. ఓ పంచాయితీ అధికారి అవినీతి భాగోతంపై ఏసీబీ సోదాల్లో బయటపడ్డ నిజాలివి. రెండు కిలోల బంగారం, ఇరవైకోట్లకు పైగా ఆస్తులు అవినీతి సంపాదనతో కూడబెట్టాడు. మితిమీరిన వ్యవహారంపై నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు అతగాడి అవినీతి భాగోతాన్ని బట్టబయలు చేశారు. హైదరాబాద్ శంషాబాద్ పంచాయతీ అధికారి సురేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించగా 20 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తేలింది. భారీగా బంగారం, నగదుతో పాటు ఖరీదైన విల్లాతో పాటు ఇతర ఆస్తులకు సంబంధించిన పత్రాలు సోదాల్లో బయటపడ్డాయి.

దీంతో ఏసీబీ అధికారులు సురేందర్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేసి న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు.సురేందర్ రెడ్డి కొన్ని సంవత్సరాలుగా శంషాబాద్ పంచాయతీ అధికారిగా కొనసాగుతున్నారని అయితే ఇతనిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. డిపార్ట్‌మెంట్ నుంచి వచ్చిన సమాచారంతోనే ఏసీబీ నిఘా పెట్టింది. ప్రాధమిక దర్యాప్తు లో ఆధారాలు దొరకడంతో ఏకకాలంలో సోదాల్లో భాగంగా భారీ ఎత్తున బంగారం, నగదు, విలువైన ఆస్తి పత్రాలతో కలిసి ఇప్పటివరకు దాదాపు 2 కోట్ల 31 లక్షల 63 వేల సోత్తును స్వాధీనం చేసుకున్నారు.

విలాసవంతమైన విల్లా, నాలుగు ప్లాట్స్, ఇంట్లో, లాకర్ లో కలిసి సుమారు రెండు కేజీల బంగారం, భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ.20 కోట్లకు పైగా ఉంటుందని తెలిసింది. సురేందర్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్‌లో ఉన్నారు. ప్రతి డిపార్ట్‌మెంట్‌లో అవినీతిపై ఏసీబీ అధికారులు నిఘా ఉంటుంది. ఎవరైనా అవినీతికి పాల్పడితే వారు ఎంతటి వారైనా సరే వదిలి పెట్టేది లేదంటున్నారు ఏసీబీ అధికారులు.


Show Full Article
Print Article
Next Story
More Stories