Hyderabad: మల్కాజ్‌గిరి ఏసీపీ ఇంటికి ఏసీబీ అధికారులు

Hyderabad: మల్కాజ్‌గిరి ఏసీపీ ఇంటికి ఏసీబీ అధికారులు
x
Highlights

Hyderabad: గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏసీబీ రైడ్లు, అక్రమ సంపాదన వెలికి తీత జరుగుతూనే ఉంది. మొన్నటికి మొన్న మెదక్ అడిషనల్...

Hyderabad: గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఏసీబీ రైడ్లు, అక్రమ సంపాదన వెలికి తీత జరుగుతూనే ఉంది. మొన్నటికి మొన్న మెదక్ అడిషనల్ కలెక్టర్ గడ్డం నగేష్‌ ఓ భూ వివాదంలో పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా బుక్కైపోయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో ప్రభుత్వ అధికారి ఏసీబీ రైడ్లలో అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకెళితే హైదరాబాద్ మల్కాజ్‌గిరి ఏసీపీ నరసింహారెడ్డి ఇంట్లో ఈ రోజు ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఏసీపీ నరసింహారెడ్డి ఇంట్లో పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏసీపీ రూ. 50 కోట్ల అక్ర‌మాస్తులు సంపాదించిన‌ట్లు ఇప్పటికే ఏసీబీ అధికారులు గుర్తించారు.

ఏసీపీ ఇంట్లో మాత్రమే కాకుండా హైద‌రాబాద్‌లోని మ‌హేంద్ర‌హిల్స్, వ‌రంగ‌ల్‌లో 3 చోట్ల‌, క‌రీంన‌గ‌ర్‌లో 2 చోట్ల, న‌ల్ల‌గొండ‌లో 2 చోట్ల‌, డీడీ కాల‌నీ, అంబ‌ర్‌పేట‌, ఉప్ప‌ల్, అనంత‌పురంలో పలుచోట్ల ఆయ‌న బంధువుల నివాసాల్లో ఏసీబీ అధికారులు ఏకకాలంలో సోదాలు కొనసాగిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు ఆరోపణలతో ఏసీబీ సోదాలు చేసింది.

మాజీ ఐజీ చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి అల్లుడు న‌ర్సింహారెడ్డి కావడం, మంచి పోస్టింగ్‌లో ఉంటూ ఆస్తికి మించిన ఆదాయాన్ని సంపాదించాడని అతనిపై ఆరోపణలు రావడంతో అధికారులు తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం మల్కాజ్‌గిరి ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న నరసింహారెడ్డి పూర్వం ఉప్పల్‌ సీఐగా పని చేశారు. అక్కడి విధులు నిర్వహిస్తున్న సమయం నుంచే ఆయనకు పలు భూ వివాదాలతో పాటు సెటిల్‌మెంట్లలో సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories