Hyderabad: ఓఆర్‌ఆర్‌ వద్ద రూ.21 కోట్ల విలువైన గంజాయి పట్టివేత

21 Crores Worth Ganja Seized at Hyderabad ORR
x

21 కోట్ల విలువైన గంజాయి పట్టుకున్న ఎన్సీబీ అధికారులు (ఫోటో ది హన్స్ ఇండియా)

Highlights

Hyderabad: 3,400 కిలోల గంజాయి పట్టుకున్న ఎన్‌సీబీ అధికారులు

Hyderabad: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఎన్సీబీ అధికారులు భారీగా గంజాయి పట్టుకున్నారు. విశాఖ ఏజెన్సీ నుంచి ముంబైకి తరలిస్తున్న ముఠాను అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 3 వేల 400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు 21కోట్లు ఉంటుందని అంచనా వేశారు.. గంజాయి కేసులో ఇప్పటి వరకు 25 మందిని అరెస్ట్ చేశారు. గంజాయి డాన్ షిండే పోలీసులకు పట్టుబడ్డారు.. షిండే కోసం ఆరు రాష్ట్రాల పోలీసులు వెతుకుతున్నారు. షిండేతో పాటు.. కాంబ్లీ, జోక్ డ్యాన్డ్‌లను కూడా అరెస్ట్ చేశారు.

141 సంచుల్లో నింపి గంజాయిని అక్రమంగా తరలిస్తున్నట్టు ఎన్సీబీ అధికారులు గుర్తించారు. సంచులపైన చెట్ల మొక్కలతో కప్పిపెట్టి తరలిస్తున్నారు. ముంబై, పుణే, థానే ప్రాంతాలకు గంజాయి సరఫరా చేస్తున్నట్టు ఎన్సీబీ అధికారులు గుర్తించారు. మహారాష్ట్రలోని కొన్ని కాలేజీలకు ఈ మత్తు పదార్ధాలు సరఫరా చేస్తున్నట్టు అనుమానిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం 4 వేల కిలోల గంజాయి తరలిస్తున్న కేసుల్లో 16 మందిని అరెస్ట్ చేశారు. వారు ఇచ్చిన సమాచారంతోనే ఔటర్ రింగ్ రోడ్డు వద్ద భారీగా గంజాయి పట్టుకున్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 7 వేల 500 కిలోల గంజాయిని సీజ్ చేసి.. 25 మందిని ఎన్సీబీ అధికారులు అరెస్ట్ చేశారు.


Show Full Article
Print Article
Next Story
More Stories