IPL 2021: క‌రోనా ఎఫెక్ట్ ..ముంబై- హైదరాబాద్‌‌ మ్యాచ్ పై నీలినీడలు

corona efect on ipl
x

mi vs srh

Highlights

IPL 2021: దేశ‌వ్యాప్తంగా కరోనా రెండో ద‌శ వేగంగా వ్యాప్తి చెందుంది.

IPL 2021: దేశ‌వ్యాప్తంగా క‌రో్నా రెండో ద‌శ వేగంగా వ్యాప్తి చెందుంది. ఈసారి క‌రోనా సెగ ఐపీఎల్ కు తాకింది. ఈ నేప‌థ్యంలో ఐపీఎల్ కొన‌సాగించ‌డం ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే ఇద్దరు ప్లేయర్లు, ఓ కోచ్‌‌ కరోనా బారిన పడడంతో సోమవారం జరగాల్సిన ఆర్‌సీబీ-కేకేఆర్ మ్యాచ్ వాయిదా పడింది.

మ‌రో వైపు ఇవాళ ఢిల్లీలో జరిగే ముంబై ఇండియన్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌ మ్యాచ్ పై నీలినీడ‌లు క‌మ్ముకున్నాయి. దీంతో ఈ మ్యాచ్ కూడా ఆగిపోయే సూచ‌న‌లు కనిపిస్తున్నాయి. ​ సోమవారం తమ ప్రాక్టీస్​ను రద్దు చేసుకోవడం దీనికి బలం చేకూరుస్తోంది. అయితే విశ్లేషకులు, బీసీసీఐ సన్నిహిత వర్గాలు మాత్రం నేటి మ్యాచ్‌కు ఎలాంటి డోకా లేదంటున్నారు.

మరోవైపు ఐపీఎల్‌ వేదికల్లో ఒకటైన ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్లా మైదాన సిబ్బందికి కరోనా వచ్చిందని వార్తలు రావడం ఆందోళన రెకెత్తించింది. అయితే డీడీసీఏ అధ్యక్షుడు రోహన్‌ జైట్లీ దీనిని ఖండింంచారు. క‌రో్నా సోకిన వారేవ్వరు ఈ జాబితాలో లేర‌ని స్పష్టం చేశారు

గ‌త ఏడాది అద్భ‌తంగా రాణించి ప్లేఆఫ్ చేరిన హైద‌రాబాద్..ఈ సారి మాత్రం విఫ‌ల‌మైంది. దీంతొ పాయింట్ల ప‌ట్టిక‌లో చివరి ప్లేస్‌‌లో ఉన్నకొన‌సాగుతుంది. ప్లే ఆఫ్స్‌‌ రేసులో నిలవాలంటే మిగిలిన 7 మ్యాచ్‌‌ల్లో కనీసం 6 నెగ్గాల్సి ఉంటుంది. కొత్త కెప్టెన్‌‌ కేన్‌‌ విలియమ్సన్‌‌ సారథ్యంలో తొలి మ్యాచ్ ఓడిన స‌న్ రైజ‌ర్స్ ఈ మ్యాచులో్ ఏమాత్రం ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

ఇవాళ మ్యాచ్ జ‌రిగితే డిఫెండింగ్‌‌ చాంపియన్‌‌ ముంబై ఇండియన్స్‌‌తో రెండోసారి తలపడనుంది. మరోవైపు వరుసగా రెండు మ్యాచ్‌లు నెగ్గిన ముంబై ఇండియన్స్ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. పొలార్డ్ పూర్తి ఫామ్మ్ లోకి రావ‌డం ఆజ‌ట్టుకు రెట్టించిన బ‌లం.

Show Full Article
Print Article
Next Story
More Stories