House flies: వర్షాకాలంలో ఈగల బెడద మరీ ఎక్కువ.. ఇలా చేస్తే కనిపించవు..!

House flies: వర్షాకాలంలో ఈగల బెడద మరీ ఎక్కువ.. ఇలా చేస్తే కనిపించవు..!
x

Do this to avoid the plague of houseflies during rainy season

Highlights

House flies: వర్షాకాలంలో ఈగల బెడద మరీ ఎక్కువ.. ఇలా చేస్తే కనిపించవు..!

House flies: వర్షకాలంలో ఇంట్లో ఈగల బెడద మరీ ఎక్కువగా ఉంటుంది. వంటగదిలో, బాత్‌రూమ్‌లో, ఇంటి ఆవరణలో ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి. ఇది మీ టేబుల్‌పై ఉండే ఆహార గిన్నెల వద్ద కనిపించినప్పుడు మరింత చికాకుగా ఉంటుంది. దీని కారణంగా మీరు అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. అయితే వీటిని నివారించడానికి ఇంట్లోనే పాటించే కొన్ని చిట్కలు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

ఉప్పునీరు

ఈగలను తరిమికొట్టడానికి ఒక గ్లాసు నీటిలో 2 టీస్పూన్ల ఉప్పు కలపండి. ఈ నీటిని స్ప్రే బాటిల్‌లో నింపి ఈగలు కనిపించిన చోట చల్లండి. దీంతో అవి రాకుండా ఉంటాయి.

పుదీనా, తులసి నీరు

పుదీనా, తులసి పేస్టులా చేసుకొని దీనిని కొన్ని నీటిలో కలపాలి. ఆ నీటిని ఒక స్ప్రే సీసాలో నింపి ఈగలు కనిపించిన చోట పిచికారీ చేయాలి. ఇది ఈగలను తరిమికొట్టడానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది.

పాలు , నల్ల మిరియాలు

ఒక గ్లాసు పాలలో ఒక టీస్పూన్ నల్ల మిరియాలు, 3 టీస్పూన్ల చక్కెర కలపండి. ఇప్పుడు ఈ నీటిని ఈగలు కనిపించే చోట ఉంచండి. నిజానికి ఈగలు ఈ నీటివైపు ఆకర్షితులై ఇందులో మునిగి చనిపోతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories