ఈ సీజన్‌లో ద్రాక్ష పండ్లను తింటున్నారా.. ఈ విషయాలపై ఓ లుక్కేయండి..!

నార్మల్‌ ద్రాక్ష తీపి, పుల్లని రుచి కలిగి ఉంటుంది. ఎండుద్రాక్ష తియ్యగా ఉంటుంది. దీనిని స్వీట్లు, తీపి వంటకాల తయారీలో ఉపయోగిస్తారు.
ద్రాక్ష కంటే ఎండుద్రాక్షలో కేలరీలు ఎక్కువ ఉంటాయి. వాస్తవానికి ద్రాక్షను ఉడకబెట్టి, ఆరబెట్టి ఎండుద్రాక్ష తయారు చేస్తారు. ఈ ప్రక్రియలో చక్కెర, యాంటీఆక్సిడెంట్లు కేలరీల రూపంలోకి మారుతాయి.
ఎండుద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఐరన్‌, పొటాషియం వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి
సాధారణ ద్రాక్షలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ రెండు పోషకాలు చర్మ కణాలను యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి.