మీరు వాడే ట్యాబ్లెట్స్‌ నిజమైనవా నకిలీవా.. ఇలా గుర్తించండి..!
మనం తెలియకుండా వేలకొద్ది డబ్బులు పెట్టి నకిలీ మందులు కొని వ్యాధులు తగ్గక హాస్పిటల్స్‌ చుట్టూ తిరుగు తున్నాం.
నకిలీ మందులు నాణ్యత లేని మందులు. ఔషధాల పరిమాణం అవసరమైన దానికంటే తక్కువగా ఉంటుంది. ఇలాంటి మందులు వాడడం వల్ల రోగికి ఎలాంటి ప్రయోజనం ఉండదు.
నిరంతరంగా మందులు వేసుకున్నా, రక్తపోటు తగ్గకపోయినా, ఉపశమనం లభించకపోయినా వెంటనే డాక్టర్‌ని కలిసి మందులు చూపించాలి.
ఇటీవల ప్రభుత్వం మందులపై క్యూఆర్ కోడ్ పెట్టే విధానాన్ని తీసుకొచ్చింది. ఇందులో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం వల్ల మందుల సమాచారాన్ని పొందవచ్చు.
ఈ విధానం ఎంపిక చేసిన మందులపై మాత్రమే ఉంది అన్నిటికి లేదు. మెడిసిన్‌లో ఇచ్చిన సమాచారం క్యూఆర్‌ కోడ్‌తో సరిపోలకపోతే అధికారులకు ఫిర్యాదు చేయవచ్చు