కూల్‌డ్రింక్స్‌ ఎక్కువగా తాగుతున్నారా.. నిపుణులు చెబుతున్న నిజాలు తెలుసుకోండి..!

పెళ్లిళ్లు, ఫంక్షన్లు, శుభకార్యాలలో ఫుడ్‌ ఐటమ్‌గా సర్వ్‌ చేస్తున్నారు. చివరకు వీటిని ఇంటికి తెచ్చుకొని ఫ్రిజ్‌లలో స్టోర్‌ చేసుకొని తాగుతున్నారు.
కూల్‌డ్రింక్స్‌ ఎక్కువగా తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది. ఇది జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది. కడుపు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
కూల్‌డ్రింక్స్‌లో అధిక మొత్తంలో చక్కెర, కెఫిన్ ఉంటుంది. ఇవి రక్తపోటును పెంచుతాయి. గుండె జబ్బులకు కారణమవుతాయి.
మీరు అతిగా కూల్‌డ్రింక్స్‌ తాగితే రక్తంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరుగుతుంది. డయాబెటిక్ పేషెంట్లకు ఇది విషం కంటే తక్కువేమీ కాదు.