Health Emergency: వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీ దిశగా డబ్ల్యూహెచ్ఓ అడుగులు

Health Emergency Across the World
x

Health Emergency:(File Image) 

Highlights

Health Emergency: ప్రపంచ వ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించేందుకు డబ్ల్యూహెచ్ ఓ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Health Emergency: చైనా దేశంలోని వ్యూహాన్ లో పుట్టిన మహమ్మారి యావత్‌ ప్రపంచాన్ని ముప్పతిప్పలు పెడుతోంది. ప్రపంచాన్నే అతలాకుతలం చేసేస్తోన్నకరోనా వైరస్ పాండమిక్ పరిస్థితి ని వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. నిజానికి ఈ దిశగా ప్రకటన చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడో రెడీ అయినా.. కొన్ని అగ్రదేశాల సానుకూలత కనిపించకపోవడంతో మీనమేషాలు లెక్కిస్తున్నట్లు ఇంటర్నేషనల్ మీడియా కథనాలు వస్తున్నాయి. ఇంతటి దారుణమైన పరిస్థితి గతంలో ఎన్నడూ లేని కారణంగా ప్రస్తు కరోనా పాండమిక్ పరిస్థితిని వరల్డ్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాల్సిందేనని కొన్ని సంస్థలు గట్టిగానే కోరుతున్నాయి.

కోవిడ్ మహమ్మారి ధాటికి ఇప్పటి వరకు దాదాపు 33 లక్షల మందిని బలితీసుకుంది. అయితే, ఈ విపత్తును ఎదుర్కొనే సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ తీసుకున్న పేలవమైన నిర్ణయాల కారణంగానే ప్రస్తుత సెకెండ్ వేవ్ సంక్షోభానికి కారణమని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కొనే సంసిద్ధతపై ఏర్పడిన అంతర్జాతీయ నిపుణుల బృందం ఈ మేరకు అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

భవిష్యత్‌లో ఇలాంటి విపత్తులు నివారించడానికి ఓ 'అంతర్జాతీయ అప్రమత్త అవసరమని 'కొవిడ్‌-19: మేక్‌ ఇట్‌ ఇన్‌ ది లాస్ట్‌ పాండమిక్‌' పేరుతో అంతర్జాతీయ నిపుణుల బృందం రూపొందించిన నివేదిక సూచించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యవసర స్థితిని ప్రకటించడంలో ప్రపంచ ఆరోగ్యసంస్థ ఆలస్యం చేసిందని తమ నివేదికలో నిపుణుల బృందం అభిప్రాయపడింది. ఈ కారణంగానే ప్రపంచ ఆరోగ్య సంస్థలో సమూల సంస్కరణలు అవసరమని తెలిపింది నిపుణుల బృందం.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ విలయం, ఫ్యూచర్‌లో ఏర్పడే మహమ్మారులను ఎదుర్కొనే సన్నద్ధతపై ఓ రిపోర్టును రూపొందించాలన్న ఉద్దేశంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మెంబర్ కంట్రీస్ నిర్ణయించాయి. ఇందుకోసం న్యూజిలాండ్‌ మాజీ ప్రధాని హెలెన్‌ క్లార్క్‌, లైబీరియా మాజీ అధ్యక్షుడు ఎల్లెన్‌ జాన్సన్‌ సర్లీఫ్‌ అధ్యక్షతన అంతర్జాతీయ నిపుణులతో కూడిన ఓ ఇండిపెండెంట్ టీమ్ ఏర్పడింది.గతేడాది ఏర్పాటైన ఈ నిపుణుల బృందం.. మహమ్మారిని ఎదుర్కోవడంలో తీసుకోవాల్సిన చర్యలు, జీ7 (G7), జీ20 (G20) దేశాల మద్దతు, పేద దేశాలకు వ్యాక్సిన్ల సరఫరా, వ్యాక్సిన్‌ తయారీ సంస్థలకు నిధులు, సాంకేతికత బదలాయింపు వంటి సూచనలతో కూడిన తుది నివేదికను తాజాగా విడుదల చేసింది. దీనికి అనుగుణంగా వేగవంతమైన నిర్ణయాలతోనే కరోనాపై మానవాళి విజయం సాధించే అవకాశం వుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories