Nitish Kumar: నితీష్‌ రాజీనామా.. మహాకూటమిలో పరిస్థితులు సరిగా లేవు

Nitish Submitted His Resignation To The Governor
x

Nitish Kumar: నితీష్‌ రాజీనామా.. మహాకూటమిలో పరిస్థితులు సరిగా లేవు

Highlights

Nitish Kumar: అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే ఈ నిర్ణయం

Nitish Kumar: బిహార్‌లో వేగంగా రాజకీయాలు మారుతున్నాయి. కాసేపటి క్రితం సీఎం తన రాజీనామాను గవర్నర్‌కు సమర్పించారు. దీంతో జేడీయూ - ఆర్జేడీ - కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోయింది. సాయంత్రం మళ్లీ సీఎంగా నితీష్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. బీజేపీతో కలిసి నూతన ప్రభుత్వాన్ని జేడీయూ ఏర్పాటు చేయనుంది. మహాకూటమిలో పరిస్థితులు సరిగా లేవని ఈ సందర్భంగా నితీష్ వ్యాఖ్యనించారు. మహాకూటమి ముందుకు వెళ్లలేకపోయిందని..అందుకే గతంలో ఉన్న ఎన్డీఏ కూటమితో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే ఈ నిర్ణయం తీసుకున్నానని నితీష్ కుమార్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories