Sampoornesh Babu : పవన్ అన్నా దీన్ని ఫ్రేమ్ కట్టించుకుంటా... సంపూర్ణేష్

Sampoornesh Babu : పవన్ అన్నా దీన్ని ఫ్రేమ్ కట్టించుకుంటా... సంపూర్ణేష్
x

Sampoornesh Babu, Pawan kalyan

Highlights

Sampoornesh Babu : నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 49వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా మెగా

Sampoornesh Babu : నిన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 49వ పుట్టినరోజు జరుపుకున్న సంగతి తెలిసిందే.. ఈ సందర్భంగా మెగా అభిమానులు, సినీ, రాజకీయ,క్రీడా ప్రముఖులు అయనకి శుభాకాంక్షలు అందజేశారు. అందులో భాగంగానే సినీ హీరో సంపూర్ణేష్ బాబు పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. "జన హృదయ నేత, జనసేనానికి జన్మదిన శుభాకాంక్షలు" అంటూ సంపూ ట్వీట్ చేశారు.

అయితే తనకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేశారు పవన్ కళ్యాణ్ .. అందులో భాగంగానే సంపూర్ణేష్ బాబు ట్వీట్ కి స్పందించిన పవన్.. " థాంక్స్ డియర్ సంపూర్ణేష్ బాబు " దీనితో సంపూ ఆనందానికి అవధులు లేవు... " అన్నా, మీ దగ్గర నుంచి ఈ రిప్లై రావటం , ఫోటో ఫ్రేమ్ కట్టించుకుంటాను, ఎంత సంతోషంగా ఉందొ మాటల్లో చెప్పలేను" అంటూ ట్వీట్ చేశాడు సంపూ...

అజ్ఞాతవాసి సినిమా తర్వాత రెండేళ్ళు రాజకీయాలకి పరిమితం అయిన పవన్ మళ్ళీ వరుస సినిమాలతో ప్రేక్షలను అలరించడానికి సిద్దం అయ్యారు. వకీల్ సాబ్ చిత్రంతో పాటుగా క్రిష్, హరీష్ శంకర్, దర్శకత్వంలో సినిమాలను చేసేందుకు సిద్దం అయ్యారు. నిన్న పవన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాలకి సంబంధించిన అప్డేట్ లను చిత్రబృందం విడుదల చేసింది. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో పవన్ సినిమా ఉంటుందని ప్రచారం నడిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories