శంకర్ డైరెక్షన్ లో యశ్‌, విజయ్?

శంకర్ డైరెక్షన్ లో యశ్‌, విజయ్?
x
Highlights

కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ రికార్డులను సృష్టించింది. ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు నటుడు యశ్‌..

కేజీఎఫ్ సినిమా ఎంత పెద్ద విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా భారీ రికార్డులను సృష్టించింది. ఇక ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు నటుడు యశ్‌.. దీనితో యశ్‌ తో సినిమాలను చేసేందుకు స్టార్ డైరెక్టర్ లు పోటిపడుతున్నారు. ఆ మధ్య టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో యశ్‌ ఓ సినిమా చేయనున్నాడన్న వార్తలు కూడా వచ్చాయి. కానీ అవేమి నిజం కాలేదు.

అయితే ఇప్పుడో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి కోలీవుడ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. అదే టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో యశ్‌ ఓ సినిమా చేస్తున్నాడనే ప్రచారం నడుస్తోంది. ఈ సినిమా ఏకంగా మల్టీస్టారర్ నేపధ్యంలో నడుస్తుందని తెలుస్తోంది. ఇందులో విజయ్ మరో హీరోగా నటిస్తున్నాడట.. దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు. శంకర్‌ చెప్పిన కథ నచ్చడంతో యశ్‌, విజయ్ కూడా వెంటనే ఓకే చెప్పారని జనవరిలో సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని తెలుస్తోంది.

ఇక ప్రస్తుతం శంకర్ ఇండియన్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. కమల్ హసన్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రాలలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతానికి వాయిదా పడింది. అయితే ఈ సినిమా పూర్తిగా ఆగిపోయిందనే ప్రచారం నడుస్తోంది. ఎందుకంటే ఆ మధ్య ఈ సినిమా షూటింగ్ సమయంలో సెట్ లో భారీ ప్రమాదం జరగడంతో షూటింగ్ తిరిగి స్టార్ట్ చేయడం పైన సినీ నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో కమల్, శంకర్ తమ తమ సినిమాలతో బిజీ అయిపోయారు. చూడాలి మరి ఎం జరుగుతుందో.

Show Full Article
Print Article
Next Story
More Stories