Anti Aging Fruits: ఈ ఐదు పండ్లు ఖతర్నాక్​.. మీ వయసు కనపడకుండా చేస్తాయ్​..!

These five fruits are the anti ageing antidote to make you look 20 years old even if you reach 40 years old
x

Anti Aging Fruits: ఈ ఐదు పండ్లు ఖతర్నాక్​.. మీ వయసు కనపడకుండా చేస్తాయ్​..!

Highlights

Anti Aging Fruits: ఈ రోజుల్లో చాలామంది అందంగా కనిపించడానికి మార్కెట్​లో లభించే బ్యూటీ ప్రొడక్ట్స్​ని కొనుగోలు చేసి వాడుతుంటారు.

Anti Aging Fruits: ఈ రోజుల్లో చాలామంది అందంగా కనిపించడానికి మార్కెట్​లో లభించే బ్యూటీ ప్రొడక్ట్స్​ని కొనుగోలు చేసి వాడుతుంటారు. మరికొందరు కొత్తగా ఏది వస్తే అది వెంటనే తెచ్చుకొని ఫేస్​కు అప్లై చేస్తూ ఉంటారు. వీటివల్ల అందంగా కనిపిస్తారో లేదో తెలియదు కానీ సైడ్​ ఎఫెక్ట్స్​ మాత్రం కచ్చితంగా ఉంటాయి. నిజానికి తెలియని విషయం ఏంటంటే బ్యూటీ క్రీమ్స్​, ట్యాబ్లెట్లు వాడితే అందంగా కనిపించరు. ఆహార విధానంలో మార్పులు చేయాలి. ముఖ్యంగా డైట్​లో ఫ్రూట్స్​ని చేర్చుకోవాలి. ఇవి చర్మాన్ని యవ్వనంగా చేస్తాయి. అలాంటి ఐదు పండ్ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

ఆరెంజ్

ఆరెంజ్​ అన్ని కాలలో లభిస్తుంది. చలికాలంలో అయితే ఎక్కువగా లభిస్తాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. నారింజలో ఉండే అధిక యాంటీ-ఆక్సిడెంట్ కంటెంట్లు శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ను నిర్మూలిస్తాయి. రోజూ నారింజ తింటే చర్మం టైట్​గా మారి అందంగా తయారవుతారు.

అవకాడో

యాంటీ ఏజింగ్ ఫ్రూట్స్‌లో అవకాడో కూడా ఉంది. ఇది శరీరానికి కొవ్వు ఆమ్లాలను అందిస్తుంది. విటమిన్ కె, సి, ఇ, ఎ, బి పుష్కలంగా ఉంటాయి. అవకాడోలో పొటాషియం కూడా పెద్ద మొత్తంలో లభిస్తుంది. రోజూ అవకాడో తినడం వల్ల చర్మం యవ్వనంగా మారుతుంది. ఇంకా మెరుస్తూ కనబడుతుంది.

బొప్పాయి

బొప్పాయి పండు ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది. ఇందులో యాంటీ ఏజింగ్ కంటెంట్​ ఎక్కువగా ఉంటుంది. బొప్పాయిలో విటమిన్-సి, ఫోలెట్, విటమిన్-ఎ, మెగ్నీషియం, పొటాషియం, కాపర్, విటమిన్-కె వంటివి అధికంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యానికి చాలా మంచివి. ముఖం మీద ముడతలు రాకుండా చేస్తాయి.

రేగు పండ్లు

రేగు పండ్లలో విటమిన్ ఎ, విటమిన్ సి ఉంటాయి. ఇవి చర్మానికి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను అందిస్తాయి. వీటిని తినడం వల్ల చర్మం యవ్వనంగా తయారవుతుంది. అంతేకాదు ఇవి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

యాపిల్

యాపిల్స్ లో విటమిన్ ఎ, బి కాంప్లెక్స్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. యాపిల్ తినడం వల్ల చర్మం లోపలి నుంచి యవ్వనంగా మారుతుంది. అందుకే డాక్టర్లు ప్రతిరోజు ఒక యాపిల్​ తినమని సలహా ఇస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు తప్పనిసరిగా తినాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories