Brain Damage: ఈ అలవాట్లు మెదడుకి హాని కలిగిస్తాయి.. మార్చుకోపోతే ఇబ్బందిపడుతారు..!

These Bad Habits Can Damage The Brain And Cause Trouble If Not Changed
x

Brain Damage: ఈ అలవాట్లు మెదడుకి హాని కలిగిస్తాయి.. మార్చుకోపోతే ఇబ్బందిపడుతారు..!

Highlights

Brain Damage: శరీరంలోని ప్రధాన అవయవాలలో మెదడు ఒకటి. మనిషి శారీరక, మానసిక పనులు మొత్తం దీని నియంత్రణలోనే ఉంటాయి.

Brain Damage: శరీరంలోని ప్రధాన అవయవాలలో మెదడు ఒకటి. మనిషి శారీరక, మానసిక పనులు మొత్తం దీని నియంత్రణలోనే ఉంటాయి. అందుకే మెదడు ఆరోగ్యం కాపాడుకోవడం చాలా ముఖ్యం. కానీ ఈ రోజుల్లో కొన్ని చెడు అలవాట్లు మెదడుని బలహీనపరుస్తున్నాయి. దీనివల్ల జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఈ అలవాట్లని మార్చుకోపోతే చాలా నష్టం జరుగుతుంది. అయితే మెదడుకి హాని కలిగించే అలవాట్ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

తగినంత నిద్ర లేకపోవడం: మెదడు సరిగ్గా పనిచేయడానికి నిద్ర చాలా అవసరం. తగినంత నిద్ర లేనప్పుడు మెదడుకు రక్త ప్రసరణ తగ్గిపోతుంది. ఇది జ్ఞాపకశక్తిని తగ్గిస్తుంది. ఏకాగ్రత సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.

అనారోగ్యకరమైన ఆహారం: ఆరోగ్యకరమైన ఆహారం మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. అధికంగా జంక్ ఫుడ్, ఆల్కహాల్, కెఫిన్ తీసుకుంటే అవి మెదడుకు హాని కలిగిస్తాయి.

ధూమపానం: ధూమపానం మెదడు కణాలను దెబ్బతీస్తుంది. ఇది జ్ఞాపకశక్తిని, ఏకాగ్రత సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

అధిక ఆల్కహాల్ : అధిక ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మెదడులో మంట వస్తుంది. ఇది జ్ఞాపకశక్తి ఏకాగ్రత సామర్థ్యాన్ని తగ్గిస్తుంది.

ఒత్తిడి: ఒత్తిడి మెదడులో ఒక రకమైన హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. ఇవి మెదడు కణాలను దెబ్బతీస్తాయి.

వ్యాయామం లేకపోవడం: వ్యాయామం మెదడుకు రక్త ప్రసరణను పెంచుతుంది. కొత్త న్యూరాన్ల ఏర్పాటును ప్రోత్సహిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోవడం వల్ల మెదడు ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది.

డాక్టర్ సలహా ప్రకారం: పై కారణాల వల్ల మెదడు బలహీనపడుతుందని పలువురు వైద్యనిపుణులు చెబుతున్నారు. అయితే వీటికి సంబంధించి ఏవైనా మందులు లేదా చికిత్స తీసుకోవాలనుకుంటే కచ్చితంగా డాక్టర్‌ సలహా ప్రకారం మాత్రమే చేయాలని గుర్తుంచుకోండి.

Show Full Article
Print Article
Next Story
More Stories