Red or White Onion: ఉల్లిగడ్డలో రెండు రకాలు.. ఆరోగ్యానికి ఎర్రది మంచిదా తెల్లది మంచిదా..!

There are two types of Onion know Whether Red is Better or White is Better
x

Red or White Onion: ఉల్లిగడ్డలో రెండు రకాలు.. ఆరోగ్యానికి ఎర్రది మంచిదా తెల్లది మంచిదా..!

Highlights

Red or White Onion: ఉల్లి చేసిన మేలు తల్లికూడా చేయదంటారు పెద్దలు. ఎందుకంటే ఉల్లి ఔషధాల గని. ఏ కూర వండినా ఉల్లిగడ్డ వేయాల్సిందే.

Red or White Onion: ఉల్లి చేసిన మేలు తల్లికూడా చేయదంటారు పెద్దలు. ఎందుకంటే ఉల్లి ఔషధాల గని. ఏ కూర వండినా ఉల్లిగడ్డ వేయాల్సిందే. లేదంటే అది రుచిగా ఉండదు. అంతేకాదు ఉల్లిలో ఉండే గుణాలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఆయుర్వేద మందుల తయారీలో కూడా ఉల్లిని ఉపయోగిస్తారు. ఉల్లిలో రెండు రకాలు ఒకటి తెల్లది మరొకటి ఎర్రది. ఈ రెండిటిలో ఏది ఎక్కువ మేలు చేస్తుందో ఈ రోజు తెలుసుకుందాం.

నిజానికి ఎర్ర ఉల్లితో పోలిస్తే తెల్ల ఉల్లిగడ్డల్లోనే ఆరోగ్యానికి మేలు చేసే గుణాలు ఎక్కువగా ఉంటాయి. తెల్ల ఉల్లిగడ్డలో ఉండే విటమిన్‌ సి, ఫ్లేవనాయిడ్స్‌, ఫైటోన్యూట్రియెంట్‌ ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతాయి. ఉల్లిని పచ్చిగా కానీ ఉడికించి కానీ తినవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేసే శక్తి ఉల్లిగడ్డలకు ఉంటుంది. తెల్ల ఉల్లిలోని క్రోమియం, సల్ఫర్‌లు రక్తంలోని చక్కెర నియంత్రణకు సాయపడుతాయి. తెల్ల ఉల్లిపాయలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మధుమేహాన్ని కంట్రోల్‌ చేయవచ్చు.

తెల్ల ఉల్లిలోని సల్ఫర్‌ సమ్మేళనాలు, ఫ్లేవనాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ కారకాలతో పోరాడుతాయి. ఒంట్లో కణితి పెరుగుదలను నిరోధించే సుగుణాలు ఇందులో ఉంటాయి. తెల్ల ఉల్లి యాంటీ ఆక్సిడెంట్స్‌ను పెంచుతుంది. ఇవి ట్రైగ్లిజరైడ్లను, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇంకా అధిక రక్తపోటును తగ్గించడానికి, రక్తం గడ్డ కట్టకుండా నిరోధించడానికి తోడ్పడుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories