Chinta Chiguru Benefits: చింత చిగురు ఎప్పుడైనా తిన్నారా.. ఈ విషయాలు తెలిస్తే కనిపిస్తే నోట్లో వేసుకుంటారు..!

The wonderful Medicinal properties of chinta chiguru tamarind tree pale leaves
x

Chinta Chiguru Benefits: చింత చిగురు ఎప్పుడైనా తిన్నారా.. ఈ విషయాలు తెలిస్తే కనిపిస్తే నోట్లో వేసుకుంటారు..!

Highlights

Chinta Chiguru Benefits:ఆహారం విషయంలో కొన్నిసార్లు మనం పనికిరావని అనుకున్న వాటి లోనే పోషకాలు అధికంగా ఉంటాయి.

Chinta Chiguru Benefits: ఆహారం విషయంలో కొన్నిసార్లు మనం పనికిరావని అనుకున్న వాటి లోనే పోషకాలు అధికంగా ఉంటాయి. చింత చిగురు ఆ కోవలోకే వస్తుంది. నిజానికి ఎండాకాలం లో గ్రామాల్లో చింతలు కొడుతూ ఉంటారు. వాటితో చింతపండు తయారుచేసి మార్కెట్‌లో అమ్ముతూ ఉంటారు. ఇక్కడ అందరికి చింతపండు వినియోగం గురించి తెలుసు కానీ చింత చిగురు గురించి చాలామందికి తెలియదు. ఈ రోజు చింత చిగురు ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

చింతపండు కంటే చింత చిగురు తింటేనే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. దీనిని ఆహారం లో కలిపి తీసుకుంటే శరీరానికి డైటరీ ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్ లా పని చేస్తుంది. చింత చిగురులో ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటా యి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. చింత చిగురు ఉడికిం చిన నీటిని పుక్కిలిస్తే గొంతునొప్పి, మంట, వాపు తగ్గుతాయి. యాంటీ ఇన్ ఫ్లేమటరీ గుణాలు చింత చిగురులో పుష్కలంగా ఉండడమే దీనికి కారణం.

కడుపులో నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది. జీర్ణాశయ సంబంధ సమస్యలను తొలిగించడంలో చింత చిగురు బాగా పనిచేస్తుంది. చింత చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటా యి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. తరచు చింత చిగురుతింటే ఎముకలు గట్టి పడతాయి. థైరాయిడ్ తో బాధపడేవారు చింత చిగురు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. గుండె జబ్బులకు చింత చిగురు ఔషధంలా పనిచేస్తుంది. శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందించడమే కాకుండా, రక్తాన్ని శుద్ధి చేస్తుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories