పాముల కంటే దోమలు చాలా డేంజర్‌..! ఎందుకో తెలిస్తే షాక్‌ అవుతారు..

Mosquitoes are More Dangerous than Snakes
x

పాముల కంటే దోమలు చాలా డేంజర్(ఫైల్ ఫోటో)

Highlights

* ఒక నివేదిక ప్రకారం ఏటా 1.38 లక్షల మంది పాము కాటు కారణంగా మరణిస్తున్నారు.

Mosquitoes: పాములు, దోమలలో ఏది డేంజర్‌ అంటే వెంటనే అందరు పాములు చాలా ప్రమాదకరమని చెబుతారు. ఇది నిజమే ఎందుకంటే పాము కరిస్తే విషం వెంటనే శరీరంలోకి వెళ్లి మనిషిని చంపేస్తుంది. దోమ కరిస్తే మాత్రం అక్కడ కొంచెం ఉబ్బుగా ఉంటుంది అంతే. ఎటువంటి ప్రాణహాని ఉండదు. కానీ గణంకాల పరంగా చేస్తే మాత్రం దోమలే చాలా ప్రమాదకరం.

నేషనల్ జియోగ్రాఫిక్ నివేదిక ప్రకారం ప్రపంచంలో 3 వేలకు పైగా జాతుల పాములు ఉన్నాయి. వీటిలో కేవలం 7 శాతం మాత్రమే విషపు పాములు. కానీ దోమల గురించి మాట్లాడినట్లయితే అది జికా, డెంగ్యూ, మలేరియా వంటి అనేక వ్యాధులను వ్యాప్తి చేస్తుంది.

ఒక నివేదిక ప్రకారం ఏటా 1.38 లక్షల మంది పాము కాటు కారణంగా మరణిస్తున్నారు. విషపూరితమైన పాము కాటు కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, రక్తస్రావం, మూత్రపిండాల వైఫల్యం లేదా కాళ్లు పని చేయకపోవడం వంటి అనేక రకాల సమస్యలు పెరుగుతాయి.

దీని కేసులు ఎక్కువగా రైతులు, పిల్లలలో నమోదయ్యాయి. అదే దోమల వల్ల ప్రతి సంవత్సరం 700 మిలియన్ల మంది ప్రజలు అనేక వ్యాధులతో బాధపడుతున్నారు. వీరిలో 10 లక్షల మందికి పైగా మరణిస్తున్నారు. దోమల వల్ల ఎక్కువ సంఖ్యలో ప్రజలు చనిపోవడానికి, అనారోగ్యానికి గురికావడానికి ఒక కారణం ఉంది. దోమ అనేక వ్యాధులను వ్యాప్తి చేస్తుంది. జికా, మలేరియా, ఎల్లో ఫీవర్, చికున్‌గున్యా, డెంగ్యూ లాంటివి. అదే సమయంలో పాములు కరిచిన వ్యక్తి మాత్రమే చనిపోతాడు.

విష ప్రభావం ఒక్కరికి మాత్రమే ఉంటుంది. దోమల వల్ల వచ్చే వ్యాధులను ఎదుర్కోవడానికి ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చాలా దేశాలు మలేరియా రహితంగా ప్రకటించుకున్నప్పటికీ అక్కడక్కడ ఈ కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. చైనా ఈ సంవత్సరం మలేరియా రహితంగా ప్రకటించుకుంది. గత 4 సంవత్సరాలుగా ఇక్కడ ఒక్క మలేరియా కేసు నమోదు కాకపోవడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories