Spinach Benefits: బచ్చలి కూరతో బోలెడు లాభాలు.. గర్భిణులకు చాలా మేలు..

. Lots of benefits with spinach very good for pregnant women
x

Spinach Benfits: బచ్చలి కూరతో బోలెడు లాభాలు.. గర్భిణులకు చాలా మేలు..

Highlights

Spinach Benefits: బచ్చలి కూరతో బోలెడు లాభాలు.. గర్భిణులకు చాలా మేలు..

Spinach Benefits: బచ్చలికూర ఈ పేరు ఎక్కడో విన్నట్లు ఉంది అనుకుంటున్నారా.. అవును ఇదొక ఆకుకూర. పప్పులో వేసి వండితే ఆ రుచికి బానిసగా మారిపోతారు. బచ్చలికూరతో బోలెడు లాభాలున్నాయి. ఇందులో పోషకాలు కొదువలేదు. శీతాకాలంలో బచ్చలికూర తింటే రోగనిరోధక శక్తి పెంచుకోవచ్చు. మటన్‌, చికన్‌లకి ఏ మాత్రం తీసిపోతు ముఖ్యంగా వెజిటేరియన్స్‌కి కావలసిన అన్ని పోషకాలు ఇందులో ఉంటాయి. బచ్చలికూరలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, కాల్షియం, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి ఎముకలని దృఢంగా చేస్తాయి.

ముఖ్యగా గర్భవతులు బచ్చలికూరని పుష్టిగా తినాలి. ఇందులో ఫోలిక్ యాసిడ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా పిల్లలు ఎటువంటి వైకల్యం లేకుండా పుడుతారు. బచ్చలికూర లో చాలా పోషకాలు ఉంటాయి. డైటరీ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పేగు పనితీరును నియంత్రిస్తుంది. బచ్చలికూర లోని ఫోలేట్ కడుపు, డీఎన్‌ఏ కణాలను రక్షిస్తుంది. పెద్ద పేగు కణాలలో ప్రాణాంతక ఉత్పరివర్తనలు ఏర్పడకుండా కాపాడుతుంది. బచ్చలికూర ఆరోగ్యకరమైన మెదడు పనితీరును ప్రోత్సహిస్తుంది.

బచ్చలికూర ఎముకలలో కొల్లాజెన్ నిర్మాణాలను రక్షించే మంచి కూరగాయల ప్రోటీన్ కలిగి ఉంటుంది. కండరాలు, ఎముకలను బాగా బలపరుస్తుంది. వృద్ధ రోగులలో నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేయడానికి సహాయపడే హార్మోన్ల ఉత్పత్తికి సహాయపడుతుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి బచ్చలికూర చాలా ఉపయోగకరంగా ఉంటుంది. విటమిన్ ఎ అధిక మోతాదులో ఇన్ఫెక్షన్, వాపును నివారించడంలో సహాయపడుతుంది. శ్వాస, మూత్ర, పేగు శ్లేష్మ పొరలను బలపరుస్తుంది. పిల్లలో వచ్చే పోషకాహార లోపాన్ని భర్తీ చేస్తుంది. కండర పుష్టిని పెంచుతుంది. మహిళలు వయసుపై బడకుండా ఉండాలంటే బచ్చలి కూరని కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాల్సిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories