Mangoes: మామిడి పండు తింటే షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయా..!

Know Whether Sugar Levels And Weight Increase If You Eat Mangoes
x

Eat Mangoes: మామిడి పండు తింటే షుగర్‌ లెవల్స్‌ పెరుగుతాయా..!

Highlights

Eat Mangoes: వేసవి వచ్చిందంటే చాలు చాలామంది మామిడిపండ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటారు.

Eat Mangoes: వేసవి వచ్చిందంటే చాలు చాలామంది మామిడిపండ్ల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కడ చూసినా ఘుమఘుమలాడే మామిడిపండ్లే కనిపిస్తున్నాయి. అంతేకాదు ఇవి అందరికీ అందుబాటు ధరలో లభించడం వల్ల సులువుగా కొనుగోలు చేస్తారు. అయితే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు మామిడిపండ్లకు దూరంగా ఉండాలి. కొంతమంది మామిడి పండ్లు తింటే బాడీలో షుగర్‌లెవల్స్‌, బరువు పెరుగుతారని అపోహ ఉంది. దీని గురించి కూడా ఈ రోజు తెలుసుకుందాం.

మామిడి పండు తీసుకోవడం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. 12 వారాల పాటు ఊబకాయం ఉన్నవారి ఆహారంలో మామిడి పండ్లను చేర్చడం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకునే వారికి మామిడిపండ్లు మంచివని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మామిడిపండ్లలో చక్కెర కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుందని, షుగర్ వ్యాధిగ్రస్తులు, రక్తంలో చక్కెర స్థాయిలు హెచ్చుతగ్గులు ఉండేవారు తినడం మంచిది కాదు. మామిడిలో గ్లూకోజ్, ఫ్రక్టోజ్ అనే సహజ చక్కెరలు ఉంటాయి. ఇవి తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు సులభంగా జీర్ణమవుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా పోషకాలను నెమ్మదిగా గ్రహిస్తాయి. చక్కెర స్థాయిలు నెమ్మదిగా పెరుగుతాయి.

మామిడి పండ్లలోని చక్కెర కంటెంట్ శరీర బరువును పెంచుతుందని నమ్ముతారు. కానీ మీరు క్యాలరీ పరిమితిలో ఉన్నట్లయితే వీటిని తక్కువగా తీసుకోవాలి. మామిడి పండ్లలో కేలరీలు చాలా తక్కువ. ఒక మీడియం సైజు మామిడిలో 150 కేలరీలు ఉంటాయి. ఇది చాలా పోషకమైనది. కడుపు చాలా నిండుగా ఉంటుంది. మామిడి పండులో డైటరీ ఫైబర్, విటమిన్లు,యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories