Kidney Stone Patients: కిడ్నీస్టోన్‌ పేషెంట్లు పొరపాటున ఈ పదార్థాలు తినవద్దు.. సమస్య మరింత జఠిలం..!

Kidney Stone Patients should not eat these ingredients by mistake the problem will become more Troublesome
x

Kidney Stone Patients: కిడ్నీస్టోన్‌ పేషెంట్లు పొరపాటున ఈ పదార్థాలు తినవద్దు.. సమస్య మరింత జఠిలం..!

Highlights

Kidney Stone Patients: కిడ్నీల్లో రాళ్లు రావడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. చాలామంది ఈ సమస్యతో బాధ పడుతున్నారు.

Kidney Stone Patients: కిడ్నీల్లో రాళ్లు రావడం ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. చాలామంది ఈ సమస్యతో బాధ పడుతున్నారు. నిజానికి ఇది అంత పెద్ద సమస్య ఏం కాదు కానీ నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకు ప్రమాదం. కిడ్నీ మన శరీరంలో ముఖ్యమైన అవయవం. దాని ప్రధాన పని రక్తాన్ని ఫిల్టర్ చేయడం. ఈ ప్రక్రియ జరగనప్పుడు కాల్షియం, సోడియం, అనేక రకాల ఖనిజాలు మూత్రాశయంలోకి చేరుతాయి. ఈ వస్తువుల పరిమాణం పెరిగి చివరకు రాళ్లలా మారుతాయి. ఇలాంటి వారు ఆహారపు అలవాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

విటమిన్ సి ఆహారాలు తినవద్దు

రాళ్ల సమస్య ఉన్నట్లయితే విటమిన్ సి ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. దీని కారణంగా రాళ్లు ఏర్పడుతాయి. నిమ్మకాయ, బచ్చలికూర, నారింజ, ఆవాలు, కివీ, జామ వంటి వాటిని తినడం మానేయడం మంచిది.

శీతల పానీయాలు, టీ-కాఫీ తాగవద్దు

మూత్రపిండాల్లో రాళ్లతో బాధపడుతున్న వ్యక్తులు తరచుగా డీహైడ్రేషన్ సమస్యను ఎదుర్కొంటారు. ఈ పరిస్థితిలో కాఫీ తాగవద్దు. కిడ్నీ స్టోన్‌ పేషెంట్లకు కూల్‌డ్రింక్స్‌, టీ, కాఫీలు విషం కంటే తక్కువేమీ కాదు. ఎందుకంటే వాటిలో కెఫిన్ అధిక పరిమాణంలో ఉంటుది.

ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలు కిడ్నీపేషెంట్లకు హాని కలిగిస్తాయి. ఇలాంటి వారు అధిక ఉప్పు కలిగిన పదార్థాల వినియోగాన్ని తగ్గించాలి.

నాన్ వెజ్ ఫుడ్స్

కిడ్నీ స్టోన్ రోగులకు మాంసం, చేపలు, గుడ్లు అస్సలు మంచివి కావు. ఎందుకంటే వీటిలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. శరీరానికి ఈ పోషకం ఎంత ముఖ్యమైనది అయినప్పటికీ ఇది మూత్రపిండాలపై ప్రతికూల నెగిటివ్‌ ప్రభావాన్ని చూపుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories