Chest Pain: మీకు ఛాతిలో కుడివైపున నొప్పిగా ఉందా..! అయితే ఇదే కారణం కావొచ్చు..!

do you Have Pain in the Right Side of The Chest but These are The Causes
x

Chest Pain: మీకు ఛాతిలో కుడివైపున నొప్పిగా ఉందా..! అయితే ఇదే కారణం కావొచ్చు..!

Highlights

Chest Pain: ఆధునిక కాలంలో వివిధ రకాల ఆహార శైలి కారణంగా చాలామంది ఛాతీ నొప్పి, గుండె సమస్య, అధిక రక్తపోటు వంటి సమస్యలని ఎదుర్కొంటున్నారు.

Chest Pain: ఆధునిక కాలంలో వివిధ రకాల ఆహార శైలి కారణంగా చాలామంది ఛాతీ నొప్పి, గుండె సమస్య, అధిక రక్తపోటు వంటి సమస్యలని ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ఛాతిలో కుడివైపున నొప్పి ఉన్నప్పుడు గుండె సమస్య అని అందరు భావిస్తారు. కానీ ప్రతి నొప్పి గుండెపోటు కాదు. అనేక ఇతర కారణాల వల్ల ఛాతీలో నొప్పి వస్తుంది. కుడివైపు ఛాతీలో నొప్పి రావడానికి గుండెపోటు కాకుండా ఇతర కారణాలు ఏంటో ఈ రోజు తెలుసుకుందాం.

యాసిడ్ రిఫ్లక్స్

యాసిడ్‌ రిప్లక్స్‌ దీనికి మరొక పేరు గుండెల్లో మంట. ఇది ఛాతీ దిగువ భాగంలో సంభవిస్తుంది. కడుపులో గ్యాస్‌ ఏర్పడినప్పుడు ఇది జరుగుతుంది. దీని కారణంగా ఛాతీలో నొప్పి వస్తుంది. యాసిడ్ రిఫ్లక్స్ వల్ల కడుపునొప్పి, గుండెల్లో మంట, నోటిలో పుల్లటి తేన్పులు మొదలైన సమస్యలు వస్తాయి.

అజీర్ణం

అజీర్ణం కారణంగా కుడి వైపు ఛాతీలో నొప్పి ఉంటుంది. ఈ స్థితిలో ఆహారం ఛాతీ, గొంతు మధ్య ఇరుక్కుపోయినట్లు అనిపిస్తుంది. దీంతో పాటు గొంతులో పుల్లని తేన్పులు వస్తాయి. ఇది మీకు చాలా ఇబ్బందిని కలిగిస్తుంది.

కండరాలలో ఒత్తిడి

కండరాలలో అధిక ఒత్తిడి కారణంగా ఛాతీలో నొప్పి ఉంటుంది. దీంతో పాటు ఎక్కువ వ్యాయామం చేసేవారిలో కూడా ఇది కనిపిస్తుంది. దీని కారణంగా ఛాతీలో ఒత్తిడి, ఛాతీ నొప్పి రావచ్చు, సమస్య పెరిగితే డాక్టర్ ను సంప్రదించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories