Summer Best Drinks: వేసవిలో దాహం విపరీతంగా వేస్తుందా.. డీ హైడ్రేషన్​కు గురికావొద్దంటే ఇవి తీసుకోవాల్సిందే..!

Do you feel extremely thirsty in summer drink these to avoid dehydration
x

Summer Best Drinks: వేసవిలో దాహం విపరీతంగా వేస్తుందా.. డీ హైడ్రేషన్​కు గురికావొద్దంటే ఇవి తీసుకోవాల్సిందే..!

Highlights

Summer Best Drinks: ఎండలు ముదరడంతో దాహం విపరీతంగా వేస్తోంది. దీనివల్ల శరీరం డీ హైడ్రేషన్​కు గురయ్యే అవకాశాలు ఉంటాయి.

Summer Best Drinks: ఎండలు ముదరడంతో దాహం విపరీతంగా వేస్తోంది. దీనివల్ల శరీరం డీ హైడ్రేషన్​కు గురయ్యే అవకాశాలు ఉంటాయి. కొంతమంది దీనిని కూడా మరిచిపోయి పనిమీద ధ్యాస పెడుతారు. ఇది అస్సలు మంచి పద్దతి కాదు. అలాగే మరికొందరు దాహం చాలా సేపు ఆపుకొని ఒకేసారి కూల్​ వాటర్​ తాగుతారు. ఇలా కూడా చేయకూడదు. డీ హైడ్రేషన్​ నివారించడానికి కచ్చితంగా తాగాల్సిన కొన్ని పానీయాలు ఉన్నాయి. ఇవి శరీర అవసరాలను తీర్చి అనారోగ్యానికి గురికాకుండా కాపాడుతాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

1. కొబ్బరి నీరు

కొబ్బరి నీళ్లు సహజసిద్దమైన పానీయం. ఇవి తాగడం వల్ల శరీరం లోపల నుంచి హైడ్రేట్ అవుతుంది. కొబ్బరి నీళ్లలో జింక్, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ వంటి అనేక రకాల ఎలక్ట్రోలైట్లు ఉంటాయి. అంతేకాకుండా కొంత మొత్తంలో నీరు కూడా ఉంటుంది. ఈ పరిస్థితిలో వేసవిలో వీటి కంటే మంచి హైడ్రేటింగ్ మరొకటి లేదు. మీకు వేసవిలో బాగా దాహం వేస్తే కొబ్బరినీళ్లు తాగడం చాలా బెస్ట్​. ఆరోగ్యాన్ని కాపాడడంలో ఇది ముందు వరుసలో ఉంటుంది.

2. నిమ్మరసం

ప్రతి ఒక్కరికి అందుబాటులో లభించేది నిమ్మకాయం. ముఖ్యంగా వంటింట్లో సులభంగా దొరుకుతుంది.వేసవిలో నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో డీ హైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది. ఈ నీటిలో నల్ల ఉప్పు, పంచదార, కలుపుకొని తాగితే చాలా మంంచిది. ఇవన్నీ శరీరంలో హైడ్రేషన్‌ను పెంచడంలో సాయపడుతాయి. కాబట్టి వేసవిలో నిమ్మరసం తాగడం చాలా మంచిది.

3. ఓఆర్ఎస్

ఓఆర్​ఎస్​ తాగడం వల్ల శరీరంలో నీటి లోపాన్ని తొలగించి ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేయడంలో సాయపడుతుంది. మీకు ఎప్పుడైనా బాడీలో నీటి కొరత ఉందని అనిపించినా లేదా హీట్ స్ట్రోక్ లక్షణాలను గమనిస్తే వెంటనే ఓఆర్​ఎస్​ తాగండి. ఇది డీ హైడ్రేషన్​ త్వరగా నివారిస్తుంది.

4. పాలు, నీరు

పాలు, నీళ్లు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ అవుతుంది. ఈ రెండింటిలో నీరు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో నీటి సమతుల్యతను కాపాడతాయి. నీటి లోపాన్ని నివారిస్తాయి. కాబట్టి వేసవిలో ఈ రెండు ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

5. సూప్:

సూప్ శరీరంలో నీటి సమతుల్యతను కాపాడుకోవడానికి సాయపడుతుంది. మీరు ఏ సూప్ తాగినా దాని ద్వారా శరీరంలోకి నీరు మాత్రమే చేరుతుంది. దీని వల్ల శరీరంలో హైడ్రేషన్ మెయింటెయిన్ అయి నీటి కొరత ఉండదు. మీకు ఎండాకాలం వాటర్​ ఎక్కువగా తాగడం ఇష్టం లేకుంటే సింపుల్​గా రకరకాల సూప్​లు తాగడం ఉత్తమం. వీటిని తాగడం వల్ల చాలా సమయం వరకు దాహం వేయకుండా ఉంటుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories