Health Tips: తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవడం లేదా.. మలబద్ధకం వేధిస్తుందా.. ఇలా చెక్‌ పెట్టండి..!

Are you Suffering from Indigestion or Constipation this Ayurvedic Drink will Solve the Problem
x

Health Tips: తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవడం లేదా.. మలబద్ధకం వేధిస్తుందా.. ఇలా చెక్‌ పెట్టండి..!

Highlights

Health Tips: కొంతమందికి తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవదు. తరచుగా మలబద్దకం సమస్యతో ఇబ్బందిపడుతుంటారు.

Health Tips: కొంతమందికి తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవదు. తరచుగా మలబద్దకం సమస్యతో ఇబ్బందిపడుతుంటారు. ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఒకేచోట గంటల తరబడి కూర్చొని పనిచేసేవారు ఎదుర్కొంటారు. అయితే ఈ ఆరోగ్య సమస్యలకు మందుల వల్ల తాత్కాలిక ఉపశమనం లభిస్తుంది. అందుకే ఆయుర్వేద పద్దతిలో తయారుచేసే డిటాక్స్‌ డ్రింక్స్‌ బాగా పనిచేస్తాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

పండ్లు, కూరగాయలు, మూలికలు, సుగంధ ద్రవ్యాలను ఉపయోగించి డిటాక్స్‌ డ్రింక్‌ని తయారు చేస్తారు. ఇవి బరువు తగ్గించడంలో సహాయపడుతాయి. శరీరంలోని హానికరమైన టాక్సిన్స్‌ను బయటకు పంపిస్తాయి. జీర్ణక్రియ సంబంధిత సమస్యలను అధిగమించడానికి, జీర్ణవ్యవస్థను వేగవంతం చేయడానికి సహాయపడుతాయి. నల్ల మిరియాలు, లవంగాలను ఉపయోగించి ఇంట్లో డిటాక్స్ డ్రింక్‌ని ఎలా తయారు చేసుకోవచ్చు చూద్దాం.

1 గ్లాసు నీరు, 2 లవంగాలు, 4 నల్ల మిరియాలు రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఒక గిన్నెలో ఈ నీటిని పోసి మరిగించాలి. ఫిల్టర్ చేసి అందులో కొద్దిగా నిమ్మరసం లేదా రాతి ఉప్పు కలపాలి. అంతే డిటాక్స్ డ్రింక్ రెడీ అయిపోయింది. లవంగం భారతీయ వంటగదిలో ఉపయోగించే ఒక మసాలా దినుసు. ఇది ఔషధంగా పనిచేస్తుంది. లవంగాలలో యూజినాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, ఉబ్బరం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను నివారిస్తుంది.

ఇది డిటాక్స్‌ డ్రింక్‌ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు, సాధారణ ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. నల్ల మిరియాలు భారతీయ వంటశాలలలో ఉపయోగించే మరొక మసాలా దినుసు. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచడంలో, బరువు తగ్గించడంలో, జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories