Women: మహిళలకు అలర్ట్‌.. అందంగా కనిపించడానికి ఇవి వాడుతున్నారా..!

Alert For Women If You Use These Pills To Look Beautiful You Will Face Many Problems
x

Alert Women: మహిళలకు అలర్ట్‌.. అందంగా కనిపించడానికి ఇవి వాడుతున్నారా..!

Highlights

Alert Women: ఆడ,మగ తేడాలేకుండా ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు.

Alert Women: ఆడ,మగ తేడాలేకుండా ప్రతి ఒక్కరూ అందంగా కనిపించాలని కోరుకుంటారు. కానీ ఈ విషయంలో మగవారితో పోలిస్తే ఆడవారు ఒక్క అడుగు ముందుంటారు. అందంగా కనిపించడం కోసం ఏమైనా చేస్తారు. మార్కెట్‌లో లభించే బ్యూటీ ప్రొడక్ట్స్‌ ఎంత ఖరీదైనా కొనుగోలు చేసి వాడుతూ ఉంటారు. మరికొంతమంది ఏకండా చర్మ సౌందర్యం కోసం కొల్లాజాన్‌ సప్లిమెంట్స్‌ ఉపయోగిస్తుంటారు. కానీ వీటివల్ల చాలా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయని చాలామందికి తెలియదు. ఈ రోజు వీటివల్ల ఎదురయ్యే సమస్యల గురించి తెలుసుకుందాం.

కిడ్నీ స్టోన్స్

కొల్లాజెన్ సప్లిమెంట్లను వాడడం వల్ల కిడ్నీ స్టోన్స్ వస్తాయి. జంతువుల నుంచి సేకరించిన కొల్లాజెన్‌లను అధికంగా వినియోగించినప్పుడు మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది. దీనికి ప్రధాన కారణం కొల్లాజెన్ సప్లిమెంట్లలో అధిక మొత్తంలో ఆక్సలేట్, కాల్షియం ఉండడమే. ఇవి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి కారణమవుతాయి.

జీర్ణ సమస్యలు

సౌందర్య ప్రయోజనాల కోసం తరచుగా ఉపయోగించే కొల్లాజెన్ సప్లిమెంట్లు మన జీర్ణవ్యవస్థపై నెగటివ్‌ ప్రభావాన్ని చూపుతాయి. కొల్లాజెన్ సప్లిమెంట్లను తీసుకున్న కొందరు వ్యక్తులు ఉబ్బరం, అపానవాయువు, అతిసారం సమస్యల బారినపడుతారు. జీర్ణకోశ సమస్యలు ఉన్నవారిలో ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తాయి.

అధిక కాల్షియం

కొల్లాజెన్ సప్లిమెంట్లలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి సాయపడుతుంది. అయితే ఈ సప్లిమెంట్ల ద్వారా శరీరంలో అదనపు క్యాల్షియం చేరడం వల్ల రక్తంలో క్యాల్షియం స్థాయి పెరిగి హైపర్‌కాల్సీమియా కొట్టుకుంటుంది. లక్షణాలు వికారం, వాంతులు, బలహీనత, గందరగోళం. ఇది దీర్ఘకాలంలో గుండె ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కాబట్టి కొల్లాజెన్ సప్లిమెంట్లను తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం అవసరం.

తలనొప్పి, మైకము

కొన్నిసార్లు కొల్లాజెన్ సప్లిమెంట్లను తీసుకోవడం వల్ల తలనొప్పి, మైకం ఏర్పడుతుంది. దీని లక్షణాలు వ్యక్తుల మధ్య మారుతూ ఉంటాయి. కొల్లాజెన్ సప్లిమెంట్లను తీసుకున్న తర్వాత మీకు నిరంతర తలనొప్పి లేదా మైకము ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

కాలేయ సమస్యలు

కొల్లాజెన్ సప్లిమెంట్లను ఉపయోగించే కొంతమందిలో కాలేయ సమస్యలు నివేదించారు. ఇది కాలేయ ఎంజైమ్‌లను పెంచుతుంది. కాలేయానికి హాని కలిగిస్తుంది. దీనికి ఖచ్చితమైన కారణాలు కనుగొనలేదు. కొల్లాజెన్ సప్లిమెంట్లను తీసుకున్న తర్వాత మీకు వివరించలేని కడుపు నొప్పి లేదా కామెర్లు లేదా ముదురు పసుపు మూత్రం వంటి లక్షణాలు ఉంటే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

Show Full Article
Print Article
Next Story
More Stories