Thyroid Patients: థైరాయిడ్‌ రోగులకు అలర్ట్‌.. ఇవి తీసుకుంటే సమస్య మరింత జఠిలం..!

Alert For Thyroid Patients Eating These Foods Will Increase The Problem
x

Thyroid Patients: థైరాయిడ్‌ రోగులకు అలర్ట్‌.. ఇవి తీసుకుంటే సమస్య మరింత జఠిలం..!

Highlights

Thyroid Patients: ఈ రోజుల్లో థైరాయిడ్‌ అనేది ఒక సర్వసాధారణమైన సమస్య. ఇది మహిళల్లో ఎక్కువగా వస్తుంటుంది.

Thyroid Patients: ఈ రోజుల్లో థైరాయిడ్‌ అనేది ఒక సర్వసాధారణమైన సమస్య. ఇది మహిళల్లో ఎక్కువగా వస్తుంటుంది. దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి. థైరాయిడ్ అనేది మెడలో ఉండే ఒక చిన్న ప్లీహపు గ్రంథి. ఇది శరీరానికి అవసరమైన హార్మోన్లను అందిస్తుంది. అయితే ఇది అవసరమైన దానికంటే తక్కువ లేదా ఎక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేస్తే థైరాయిడ్ వ్యాధి అంటారు. దీనిని మందులతో కంట్రోల్‌ చేయవచ్చు. కానీ జీవనశైలి, ఆహారపు అలవాట్లతో నివారించడం ఉత్తమం. దీనివల్ల ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉండవు. థైరాయిడ్‌ సమస్య ఉన్నవారు కొన్ని రకాల ఆహారాలను తినకూడదు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

గోయిట్రోజెన్ ఆహారాలు తినవద్దు

గోయిట్రోజెన్ ఆహార పదార్థాలు థైరాయిడ్ గ్రంథిలో హార్మోన్ల ఉత్పత్తిని నిరోధిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇది పిట్యూటరీ థైరాయిడ్-స్టిమ్యులేటింగ్ అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. ఇది థైరాయిడ్ కణజాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీనివల్ల గాయిటర్‌ వ్యాధికి గురికావాల్సి ఉంటుందని చెబుతున్నారు.

వేరుశనగ

వేరుశెనగ వెన్నలో గోయిట్రోజెన్ల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. ఇది హైపోథైరాయిడిజం పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. కాబట్టి హైపోథైరాయిడిజం ఉన్నవారు వేరుశెనగ వెన్న తినకూడదు.

రాగి

ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉన్నందున రాగి ఒక అద్భుతమైన మిల్లెట్. కానీ గోయిట్రోజెనిక్ ఆహారం కాబట్టి థైరాయిడ్ రోగులు నెలకు 2-3 సార్లు మాత్రమే తీసుకోవాలి. అది కూడా నానబెట్టి లేదా ఉడికించిన తర్వాత మాత్రమే తినాలి.

బాదం

బాదంపప్పులో సెలీనియం, మెగ్నీషియం రెండు పుష్కలంగా ఉంటాయి. వీటిలో గాయిట్రోజెనిక్‌ అధికంగా ఉండటం వల్ల థైరాయిడ్ సమస్య‌ను పెంచుతాయి. ఇది అయోడిన్‌ను గ్రహించే థైరాయిడ్ గ్రంథి సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. హైపోథైరాయిడిజం ఉన్నవారు ప్రతిరోజూ 3లేదా 5 నానబెట్టిన బాదంపప్పులను మాత్రమే తినాలి.

సోయాబీన్

సోయా కలిగి ఉన్న ఆహారాలు థైరాయిడ్ సప్లిమెంట్ల పనితీరును ప్రభావితం చేస్తాయి. సోయాలో థైరాయిడ్ గ్రంధిలో చికాకు కలిగించే గోయిట్రోజెన్‌లు ఉంటాయి. కాబట్టి సోయా ఉత్పత్తులకు దూరంగా ఉండడం మంచిది.

Show Full Article
Print Article
Next Story
More Stories