Reduce Period Pain: మహిళలు ఎదుర్కొనే ఆ సమస్యలకి ఇవే దివ్య ఔషధం..

How to Get Rid of Period Cramps Fast at Home | Reduce Menstrual Pain Instantly
x

Reduce Period Pain: మహిళలు ఎదుర్కొనే ఆ సమస్యలకి ఇవే దివ్య ఔషధం

Highlights

Reduce Period Pain Naturally: ప్రతి మహిళ జీవితంలో పీరియడ్స్ అనేది సహజ ప్రక్రియ.ఈ రోజుల్లో వారు చాలా ఇబ్బందిని ఎదుర్కొంటారు. థైరాయిడ్, పీసీఓడి, ఊబకాయం,...

Reduce Period Pain Naturally: ప్రతి మహిళ జీవితంలో పీరియడ్స్ అనేది సహజ ప్రక్రియ.ఈ రోజుల్లో వారు చాలా ఇబ్బందిని ఎదుర్కొంటారు. థైరాయిడ్, పీసీఓడి, ఊబకాయం, ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కొంటారు. అయితే పీరియడ్స్ సరిగ్గా లేకుంటే ఈ హోం రెమిడీస్ పాటించండి. చిటికలో ఉపశమనం దొరుకుతుంది.

1. పీరియడ్స్ ఎక్కువ కాలం ఉంటే మహిళలు బలహీనమవుతారు. దీనిని నివారించాలంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో నానబెట్టిన ఎండుద్రాక్ష తినాలి. అలాగే ఐరన్‌ ఎక్కువగా ఉండే పాలకూర, క్యారెట్, అరటి మొదలైన ఆహారాలను తినాలి.

2. నిద్ర సమయంలో గోరువెచ్చని పసుపు పాలను తాగాలి. ఇది కాకుండా పావు చెంచా పొడి అల్లం, బెల్లంలో కలిపి గోరువెచ్చని పాలలో కలిపి తీసుకోండి. దీని వల్ల పీరియడ్స్ సమయంలో నొప్పి ఉండదు.

3. పీరియడ్స్‌ను క్రమబద్ధీకరించడంలో బొప్పాయి ఉపయోగపడుతుంది. బొప్పాయిలో కెరోటిన్ ఉంటుంది ఇది ఈస్ట్రోజెన్ అనే హార్మోన్‌ను ప్రేరేపించడంలో సహాయపడుతుంది. పీరియడ్ సమయానికి రావాలని కోరుకుంటే బొప్పాయిని డైట్‌లో చేర్చుకోండి.

4. పీరియడ్స్ కారణంగా మహిళల శరీరంలో పోషకాల కొరత ఏర్పడుతుంది. ఈ లోపాన్ని భర్తీ చేయకపోతే అనారోగ్యానికి గురి కావలసి ఉంటుంది. అందుకే క్రమం తప్పకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. ఆకుపచ్చ కూరగాయలు, మొలకెత్తిన ధాన్యాలు, పాలు, కాలానుగుణ పండ్లు, కాయలు, గుడ్లు ఆహారంలో చేర్చాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories