బ్రిటిష్ చరిత్రలో అత్యధిక ఖరీదైన విడాకులు.. విడాకుల భరణం రూ. 5,555 కోట్లు

The Most Expensive Divorce in British History Divorce Maintenance is 5555 Crores | International News
x

బ్రిటిష్ చరిత్రలో అత్యధిక ఖరీదైన విడాకులు.. విడాకుల భరణం రూ. 5,555 కోట్లు

Highlights

Expensive Divorce - Britain: దుబాయ్ రాజుకు రూ.5,555 కోట్ల విడాకుల భరణం

Expensive Divorce - Britain: బ్రిటిష్ చరిత్రలో అత్యధిక ఖరీదైన విడాకులివి. దుబాయ్ ప్రధాని షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్- మక్తూమ్‌ను తన మాజీ భార్య, యువరాణి హయా బింట్ అల్-హుస్సేన్‌కు 5వేల 555 కోట్లు విడాకుల భరణంగా ఇ‍వ్వాల్సిందేనని యూకేలోని లండన్‌ హైకోర్టు ఆదేశించింది. అయితే ముందస్తుగా 2వేల,516 కోట్లు చెల్లించాలని తీర్పు ఇచ్చింది.

ఇక ఈ మిగిలిన మొత్తాన్ని మూడు నెలల్లో సెటిలిమెంట్ చేయాల్సిందిగా చెప్పింది. పైగా తదుపరి కోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు ఇద్దరు పిల్లలకు వారి జీవితాంతం భద్రతా ఖర్చులను భరించాలని కూడా స్పష్టం చేసింది. కాగా, ప్రపంచంలో అతిపెద్ద విడాకుల సెటిల్ మెంట్‌గా ఇది నిలువనుంది.

అల్-మక్తూమ్ మాజీ భార్య ప్రిన్స్‌ హయా బింట్ జోర్డాన్ మాజీ పాలకుడు కింగ్ హుస్సేన్ కుమార్తె.. పైగా ప్రస్తుత పాలకుడు కింగ్ అబ్దుల్లా సోదరి. జూన్ 2019లో షేక్ అల్-మక్తూమ్ ఆరవ భార్య ప్రిన్సెస్ హయా బింట్ అల్ హుస్సేన్ తన పిల్లలతో సహా జర్మనీకి పారిపోయి విడాకులు కోరింది. ప్రిన్సెస్‌ హయా బింట్‌ జర్మనీ దేశాన్ని ఆశ్రయం కోరింది.

ఆపై దుబాయ్ పాలకుడు అల్-మక్తూమ్ తన పిల్లల్లను ఇ‍వ్వమంటూ జర్మనీకి చేసిన అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో దౌత్యపరమైన సమస్యలు తలెత్తాయి. ఈ మేరకు ఆమె తన భద్రత, స్వేచ్ఛ కోసం యూకే కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో యూకే కోర్టు.. ప్రిన్సెస్ హయా బింట్ అల్ హుస్సేన్ భద్రతకు, వారి ఇద్దరూ పిల్లల భద్రతకు అయ్యే ఖర్చుని ఇవ్వాల్సిందిగా దుబాయ్‌ పాలకుడు అల్-మక్తూమ్‌ని ఆదేశించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories