విభజన హామీలపై సీఎం పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్

Submitted by arun on Wed, 03/28/2018 - 16:23

విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం అన్యాయం చేసిందని అన్నారు. నాలుగేళ్ల క్రితం ఒక జాతీయ పార్టీ రోడ్డున పడేసిందని, మరో జాతీయ పార్టీ మోసం చేసిందని ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని చంద్రబాబు తెలిపారు. విభజన చట్టంలోని అంశాలు, హోదా హామీని నెరవేర్చాలని సీఎం డిమాండ్‌ చేశారు. కొన్ని పార్టీలు అవిశ్వాసంపై గందరగోళం సృష్టిస్తున్నాయని మండిపడ్డారు. ఇవాళ్టి నుంచి ఏప్రిల్ 6 వరకు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని, సమయాభావం వల్ల అఖిలపక్ష భేటీకి అన్ని సంఘాలను పిలవలేకపోయామని, మరోసారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు.

English Title
We Won't Leave Special Status, Says Chandrababu

MORE FROM AUTHOR

RELATED ARTICLES