వర్మ కెరీర్ కు.. నాగ్ ఫ్యామిలీ ‘ఊపిరి’

Submitted by arun on Thu, 03/29/2018 - 11:33
rgv

రామ్ గోపాల్ వర్మ మామూలుగా ఎవరి మాటా వినని సీతయ్యగా ప్రసిద్ధుడు. కానీ.. యువ సామ్రాట్ నాగార్జున విషయానికి వచ్చే సరికి కామ్ అయిపోతాడు. శివ సక్సెస్ నుంచి ఇద్దరి మధ్యా మాంఛి అండర్ స్టాండింగ్ కూడా ఉంది. అందుకే.. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా.. రామ్ గోపాల్ వర్మతో కలిసి ఆఫీసర్ సినిమా చేశాడు.. నాగార్జున. డైరెక్ట్ సినిమాలు లేక.. వెబ్ సిరీస్ లతో కాలం గడిపేస్తున్న వర్మకు.. నాగ్ అవకాశం ఇవ్వడం అంటే.. అది మామూలు విషయం ఏమీ కాదు కదా.

ఇదే వరుసలో.. ఇప్పుడు నాగార్జున మరో బాధ్యతను రామ్ గోపాల్ వర్మపై పెట్టాడంట. తన చిన్నకొడుకు అఖిల్ కు ఎంత ప్రయత్నించినా.. విజయం దక్కకపోతుండడంతో.. ఇప్పుడు చేసే మూడో సినిమా ఇంకా విడుదల కాకముందే.. నాలుగో సినిమా బాధ్యతను వర్మ చేతుల్లో పెట్టాడట. నిర్మాతగా తానే వ్యవహరించబోతున్నాడట.

దీంతో.. కొడుకు కోసం నాగ్ పడుతున్న తపన ఏంటో అర్థమైపోతోంది. కనీసం వర్మతో అయినా.. అఖిల్ కు ఇండస్ట్రీలో మంచి హిట్ అందివ్వగలిగితే.. కెరీర్ ను గాడిలో పెట్టానన్న సంతృప్తి మిగులుతుందని నాగ్ ఆలోచనగా తెలుస్తోంది. అఖిల్ కూడా.. ఈ సినిమాపై కొండంత ఆశ పెట్టుకున్నాడట. ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే పూర్తి వివరాలు రానున్నాయి.
 

English Title
Nagarjuna to produce Ram Gopal Varma's next with Akhil Akkineni

MORE FROM AUTHOR

RELATED ARTICLES