పాకిస్థాన్‌కు గట్టి ఎదురు దెబ్బ..

Submitted by arun on Tue, 01/02/2018 - 11:30
trump

వదరుబోతు పాకిస్థాన్ కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది.. 15 ఏళ్లుగా అందిస్తున్న ఆర్థిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. ఉగ్రవాదంపై పోరుకు ఆ సొమ్మును వినియోగించాలని తాము పంపిస్తే పాకిస్థాన్ అబద్ధాలాడుతూ ఆ సొమ్మును దుర్వినియోగంచేసిందని డోనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు.. 

పాకిస్థాన్ కి అమెరికా గట్టి షాక్ ఇచ్చింది ఆర్థిక సహాయం పేరుతో అమెరికా ఇస్తున్న సొమ్మును ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగిస్తోందని మండి పడింది పాకిస్థాన్ కు ఇకపై సాయం చేసేది లేదని తేల్చి చెప్పేసింది. 15 ఏళ్లుగా పాకిస్థాన్ కు అమెరికా3,300 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేస్తూ వచ్చింది. విడతల వారిగా ఈ సాయం అందుకుంటున్న పాకిస్థాన్ ఇప్పటి వరకూ చెప్పినవి, చేసినవీ అన్నీ అబద్ధాలేనని అమెరికా ఆరోపించింది. తమను పాకిస్థాన్ బఫూన్లుగా జమ కట్టిందని మండిపడింది అప్ఘానిస్థాన్లో ఉగ్రవాదులను తాము వేటాడుతుంటే వారికి పాకిస్థాన్ ఆశ్రయం కల్పిస్తోందని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు. అయితే ట్రంప్ కామెంట్లకి పాకిస్థాన్ కూడా దీటుగానే బదులిచ్చింది త్వరలోనే దీనిపై స్పందిస్తామని యావత్ ప్రపంచానికి అసలు నిజం తెలుస్తుందని కామెంట్ చేసింది. 

English Title
Trump makes Pakistan pay for 'lies, deceit', blocks $255 million military aid

MORE FROM AUTHOR

RELATED ARTICLES