ఆశల రెక్కలు..

ఆశల రెక్కలు..
x
Highlights

ఆశ సహజం.. ఎంత చెట్టుకు అంతే గాలన్నట్టు ఎవరి స్థాయికి సంబంధించి వారికి ఆశలుంటాయి. నిరుద్యోగికి ఉద్యోగం.. ఉద్యోగికి ప్రమోషన్.. అధికారికి ఇంకాస్త...

ఆశ సహజం.. ఎంత చెట్టుకు అంతే గాలన్నట్టు ఎవరి స్థాయికి సంబంధించి వారికి ఆశలుంటాయి. నిరుద్యోగికి ఉద్యోగం.. ఉద్యోగికి ప్రమోషన్.. అధికారికి ఇంకాస్త అధికారం.. ఇలా ఎవరికీ వారుగా కళలు కంటూ ఆశల రెక్కల్ని విప్పుకుని విహరించేస్తుంటారు. ఇవన్నీ సాధారణ జన ఆశలు. కానీ, రాజకీయ నాయకుల ఆశలు వేరే లెవెల్లో ఉంటాయి. ఒక్కో పదవి దక్కే కొద్దీ ఈ ఆశయాలకు హద్దులు చెరిగిపోతుంటాయి.

ఇదంతా ఎందుకంటే.. ఇపుడు మన తెలుగు రాష్ట్రాల పాలకులు ఇద్దరి ఆశ ఆశయం ఒకటి కావటం.. వీరిరువురు తమ రాష్ట్రాల ప్రయోజనాల పేరుతొ కేంద్రంలో చక్రం తిప్పాలని అనుకోవడం. ఇందులో నిద్రాణంగా అవకాశం దొరికితే ప్రధాని పీఠాన్ని ఎక్కాలని కోరికా ఉండొచ్చునేమో. ఇపుడు కాకపోతే మరెప్పుడన్నా ఆ ఛాన్స్ దక్కొచ్చు.. ప్రయత్నిస్తే పోయేదేముంది.. అనే దూరాలోచనతో కాళ్ళకి బలపాలు చుట్టుకుని తిరిగేస్తున్నారు. రెండుగా విడిపోయిన రాష్ట్రాల అధినేతలుగా వ్యవహరిస్తున్న నాయకులిద్దరికి ఇపుడు ఢిల్లీ పీఠం పై కన్ను పడటం విచిత్రం. ఎవరికీ వారుగా తమ తమ ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా ముందుగానే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కాస్త ఆలస్యమైనా దక్షిణాది రాష్ట్రాల నుంచి ముఖ్యమంత్రి అంటూ లేటెస్ట్ పల్లవి తో ముందుకు దూకారు. ఇపుడు ఈ ఇద్దరి మధ్యా సరికొత్తగా కుర్చీ కోసం లేదా కుర్చీలో తమ వారిని కూర్చో పెట్టాలనే ఆశయం కోసం యుద్ధం మొదలైంది. అయితే, ఆ యుద్ధం కోసం వారనుసరిస్తున్న వ్యూహమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చంద్రబాబు ఉత్తరాన్ని పట్టుకుని తిరుగుతుంటే.. కేసీఆర్ దక్షిణాదిని చుట్టేస్తున్నారు. అంటే ఒకరు పై నుంచి.. మరొకరు కింద నుంచి నరుక్కు రావాలని ప్రయత్నిస్తున్నారు.

కాలం ఖర్మం కలిసొస్తే.. కలగూరగంపని నెత్తిన పెట్టుకునే అవకాశం దక్కక పోతుందా అన్నది ఈ ఇద్దరి నాయకుల ఆశ. పోనీ.. అంతవరకూ కాకపోయినా.. చక్రం తిప్పేసి ఆ గంపనెట్టుకున్న వారిని జేబులో పెట్టుకోలేకపోతామా అన్న ఆలోచనా ఇద్దరికీ ఉన్నట్టు స్పష్టమవుతోంది. అయితే, ఆ యుద్ధం కోసం వారనుసరిస్తున్న వ్యూహమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. చంద్రబాబు ఉత్తరాన్ని పట్టుకుని తిరుగుతుంటే.. కేసీఆర్ దక్షిణాదిని చుట్టేస్తున్నారు. అంటే ఒకరు పై నుంచి.. మరొకరు కింద నుంచి నరుక్కు రావాలని ప్రయత్నిస్తున్నారు. ఇక గతంలో దేవెగౌడ..గుజ్రాల్..వీపీ సింగ్..చంద్రశేఖర్ వీళ్లంతా ప్రధానులు కాగా లేనిది మనకేం తక్కువ అని భావించిన మన నాయకులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరిద్దరి వ్యవహారం ఇప్పడు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఎప్పటినుంచో జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న చంద్రబాబు మోడీ వ్యతిరేకత అనే ఒకే అంశాన్ని పట్టుకుని జాతీయ నాయకుల్నిఏకం చేసే పనిలో పడ్డారు. కొన్నాళ్ళు మోడీకి సన్నిహితంగా ఉన్నట్టుగా కనిపించిన కేసీఆర్ తర్వాత తన విధానాన్ని మార్చుకుని బిజెపి, కాంగ్రెస్ రెండిటికి సమాన దూరం అంటూ పల్లవి అందుకున్నారు. మల్లి తాజాగా దక్షిణాది ముఖ్యమంత్రి అంటున్నారు. ఇపుడు కేసీఆర్ ఈ విధానం చంద్రబాబుకు రిటన్ గిఫ్ట్ కావచ్చనే గుసగుసలు రాజకీయ పండితుల మధ్య వినిపిస్తున్నాయి. ఎందుకంటే, ఏతా.. వాతా.. కలగూర గంప కూటమే అధికారం లోకి వచ్ఛే అవకాశమే ఉంటె.. ఆ పార్టీల మధ్య తెలుగు రాష్ట్రాల నుంచే ప్రధానిని ఎన్నుకోవాలనే ఆలోచనే వస్తే, అది చంద్రబాబుకే అనుకూలమన్నది వారి వాదన. దానికి ఉత్తర భారతం నుంచి నాయకుల మద్దతు సహకరిస్తుందనేది వారి విశ్లేషణ.

ఇప్పుడు ఇద్దరు చంద్రుల రాజకీయ చాణక్యానికి కేంద్ర రాజకీయాలు కేంద్ర బిందువు కాబోతున్నాయి. ఇద్దరు మాత్రం నిజాయితీగా అయితే పదవి..లేకపోతే ప్రతిష్ట అనుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ రెండిటిలో ఏ ఒక్కటి దక్కాలన్నాఎన్నికల్లో బీజేపీ మట్టి కరవాలి.. మరందుకు అవకాశం ఎంతుందనేదే ఇప్పుడు ప్రశ్న!

Show Full Article
Print Article
Next Story
More Stories