భార్య సీక్రెట్ వీడియోలు ఫోన్‌లో.. ఫోన్ పోవడంతో..!

Submitted by arun on Fri, 08/17/2018 - 12:04
Social Media

ఫోన్ పోయిన సంఘటన ఓ బాధితుడి కొంపముంచింది. ఫోన్‌లో దాచుకున్న భార్య, భర్తల సన్నిహిత దృశ్యాలు అశ్లీల వెబ్‌సైట్‌లోకి ఎక్కడంతో ఖంగుతిన్నాడు. హైదరాబాద్ సీసీఎస్ పోలీసులను ఆశ్రయించడంతో గురువారం నిందితుడిని అరెస్టు చేశారు. ఓ వ్యక్తి 2015లో భార్యతో సంభాషించిన విషయాలను వీడియో రికార్డు చేసి సేవ్‌ చేసుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత ఫోన్‌ పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత అతడి వ్యక్తిగత వీడియోలు పోర్న్‌ వెబ్‌సైట్‌లో దర్శనమిచ్చాయి. బాధితుడు సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టి కర్ణాటక రాష్ట్రానికి చెందిన నిందితుడిని అరెస్టు చేశారు. అతడిని విచారించగా.. పోర్న్‌ వెబ్‌సైట్‌లు చూసే అలవాటు ఉందని, వీడియోలను డౌన్‌లోడ్‌ చేసి ఇతర సైట్లలో తన లాగిన్‌ ఐడీలతో పోస్ట్‌ చేసి డబ్బులు సంపాదిస్తుంటానని, అదే క్రమంలో ఈ వీడియోలను కూడా పోస్ట్‌ చేసినట్టు అంగీకరించాడు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

English Title
phone lost videos leaked

MORE FROM AUTHOR

RELATED ARTICLES